ఐదు రోజుల్లో వీరికి రాజభోగాలతో పాటు ధనలక్ష్మీ యోగం వరమిచ్చిన సూర్యుడు

సెప్టెంబర్ 16వ తేదీన కన్యరాశిలోకి సూర్య సంచారం జరగబోతోంది. గ్రహాల రాజు అయిన సూర్యుడు కన్యారాశిలోకి సంచారం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. సెప్టెంబర్ 16వ తేదీన బుధుడు పాలించే కన్యారాశిలోకి సూర్య సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కలుగుతున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
సెప్టెంబర్ 16వ తేదీన కన్యరాశిలోకి సూర్య సంచారం కారణంగా మేషరాశి జాతకులకు మంచి ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఈ సూర్యసంచారం మేషరాశి వారిలో తెలివితేటలను, ఏకాగ్రతను పెంచుతాయి. సృజనాత్మక రంగాలలో పనిచేసే వారికి ఇది సరైన సమయం. ఆర్థికంగా ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. కుటుంబంతో ఈ సమయంలో బంధం బలపడుతుంది.

Surya gochar Sun transit in virgo brings wealth and luxuries to these zodiac signs from september 16th

కర్కాటక రాశి
కన్యరాశిలోకి సూర్య సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులకు ఈ సమయం శుభసమయంగా కనిపిస్తుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. ఒత్తిడి తగ్గుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి దాని నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ పరంగాను ఎదుగుదల ఉంటుంది. మీరు మీ లక్ష్యం కోసం పని చేస్తే ఈ సమయంలో విజయం సాధిస్తారు. ప్రయాణాలు మీకు ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. పదోన్నతులకు, ఇంక్రిమెంట్లు పొందడానికి అవకాశం ఉంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు సూర్య సంచారం కారణంగా లబ్ధిని పొందుతారు. సూర్య సంచారంతో వృశ్చిక రాశి జాతకుల ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో సూర్యుని గమనం నుండి సాధారణం కంటే ఎక్కువ ప్రయోజనాలనే పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఇంట్లో ప్రశాంత వాతావరణము ఉంటుంది.ఈ సమయంలో మీకు తండ్రి మద్దతు లభిస్తుంది. కెరీర్ లోను పురోగతి కనిపిస్తుంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో సూర్య సంచారం కారణంగా లబ్ధిని పొందుతారు. ధనుస్సు రాశి జాతకుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ధనుస్సు రాశి జాతకుల కెరీర్ బలపడుతుంది. వృత్తి వ్యాపారాలలో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. ఉపాధి రంగంలో పురోగతికి మార్గాలను అన్వేషిస్తారు. మీరు ఏ పని చేసినా గొప్ప విజయాలు రావడానికి అవకాశం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+