ఈ రాశివారికి విదేశీ ప్రయాణం ఉంటుంది
వృషభరాశివారికి అదృష్ట యోగం 75 శాతం ఉండటంతో చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది.
సాంప్రదాయం ప్రకారం తెలుగు సంవత్సరం మొదటిరోజును ఉగాదిగా జరుపుకుంటాం. ఈసారి శోభకృత్ నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఏ యోగం ఉంది? లాభనష్టాలు? వారి వ్యయం ఎంతుంటుంది? ఆదాయం ఎంతుంటుంది? అవమానం, రాజపూజ్యం తదితర వివరాలను తెలుసుకుందాం.

మేష రాశి
శోభకృత్ నామ సంవత్సరంలో వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంది. ఈరాశి వారు మంచి పనుల కోసం ధనాన్ని ఖర్చుపెడతారు. ఆదాయ వ్యయాలు సమంగా ఉంటాయి. పెట్టుబడులు లాభాలనివ్వడంతోపాటు వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో విశేషమైన పేరు ప్రతిష్టలు పొందుతారు. ఏకాదశంలో శని విశేషమైన శుభాన్నిస్తున్నాడు. అదృష్ట యోగం 50 శాతం బాగుండటంతో విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో కోరుకున్న స్థాయికి చేరుకోవడంతోపాటు వ్యాపారరీత్యా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. మొహమాటం వల్ల రుణసమస్యలు రాకుండా చూసుకోవాలి. అదే సమయంలో విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు కుటుంబసభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది.

జన్మరాశిలో గురువు సంచారం
గురువు జన్మరాశిలో సంచరిస్తుండటంతో ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. రోజూ గురువుకు సంబంధించి శ్లోకాన్ని పఠిస్తుండాలి. శని ఏకాదశంలో సంపూర్ణ విజయాన్ని ప్రసాదిస్తుండటంతో అదృష్టవంతులవుతారు. అక్టోబరు 31వ తేదీ వరకు రాహువు జన్మరాశిలో, నవంబరు నుంచి ద్వాదశంలో ఇబ్బంది కలిగిస్తాడు. వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో అభిప్రాయభేదాలు రాకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. రాహు శ్లోకం చదవాలి. అక్టోబరు 31వ తేదీ వరకు సప్తమంలో కేతువు వల్ల శ్రమ ఉంటుంది. అందుకు కేతు శ్లోకం చదువుకోవాలి. కేతువు నవంబరు నుంచి షష్ఠస్థానంలో ఉంటాడు. దీనివల్ల పనులు తొందరగా అవడంతోపాటు దైవబలం ప్రశాంతతనిస్తుంది.

వృషభరాశి
ఈ రాశివారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉంది. గతంలో పెట్టుబడి పెట్టినవి ఫలితాలనివ్వడంతో ఈ రాశివారికి విశేషమైన ఆదాయం లభిస్తుంది. అదృష్ట యోగం 75 శాతం ఉండటంతో చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా, ఉద్యోగులకు అధికార లాభంతోపాటు విద్యార్థులకు విద్యాయోగం ఉంటుంది. విదేశాల్లో అవకాశాలు పెరగడంతోపాటు భూగృహ వాహన యోగాలున్నాయి. అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యంతోపాటు ద్వాదశిలో గురు సంచారం వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయి. గురువుకు సంబంధించిన శ్లోకం చదువుకోవాలి. అలాగే శని దశమంలో ఉండటంతో ఉద్యోగపరంగా ఆటంకాలు కలిగిస్తాడు. ద్వాదశంలో రాహువు శ్రమ కలిగించినా నవంబరు నుంచి శుభయోగాలనిస్తాడు. అక్టోబరు వరకు కేతువు అనుకూల ఫలితాలనివ్వడంతోపాటు ఆ తర్వాత నుంచి సమస్యలు రాకుండా ఉండేందుకు కేతు శ్లోకం చదువుకోవాలి.












Click it and Unblock the Notifications