చిన్న చిన్నవే.. ఈ వాస్తు చిట్కాలు పాటించండి.. ఊహించని మార్పు చూస్తారు!
వాస్తు ఇంటికే కాదు.. శరీరానికి కూడా ఉంటుందని తెలుసుకోండి. అంటే ఏ దిక్కున నడవాలని, ఏ దిక్కు తినాలనేవి కాదు.. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి. ఆత్మవిశ్వాసం లోపించి చాలమంది జీవితంలో పైకెదగలేకపోతుంటారు. కానీ వారికి ఆత్మవిశ్వాసం ఉంటే అద్భుతాలు సృష్టించగలుగుతారు. ఎంత కష్టపడి పనిచేసినా చాలామంది విజయాలు సాధించలేకపోతుంటారు. అందుకు చాలా కారణాలుంటాయి. అందులో ఒకటి, ప్రధానమైంది.. ఆత్మవిశ్వాసం లోపించడం. అది ఉండటానికి ఎటువంటి వాస్తు నియమాలు పాటించాలనే విషయాన్ని మనకు నిపుణులు తెలియజేస్తున్నారు.
పక్షులకు ఆహారం పెట్టండి, నీరు పోయండి.
మీకు దగ్గరలో ఉన్న మూగజీవాలకు తోచినంత ఆహారం పెట్టండి.
ప్రతిరోజు చేయడంవల్ల అది మీకు అలవాటుగా మారుతుంది.
ప్రతి జీవిలోను భగవంతుడే ఉంటాడు. మీలో కూడా ఉంటాడు.
మీరు చేస్తున్న పనికి సంతోషిస్తాడు. మిమ్మల్ని విజయంవైపు నడిపిస్తాడు.
ఆకలితో ఉన్న ఏ జీవికి అన్నం పెట్టినా చాలు.
అన్నం అంటే అన్నం అనే కాదు.. అది తినగలిగేది ఏదైనా సరే.

మీరు ఉండే గదిలో ఉదయించే సూర్యడి ఫొటో పెట్టండి.
అలాగే గుర్రం ఫొటోను, ఏడు గుర్రాలున్న ఫొటో అయినా పెట్టండి.
ఇవన్నీ మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి.
గదిలో ఖాళీ గోడకు ఎదురుగా కూర్చోవద్దు.
దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.
మీ ఇంట్లో ఎప్పుడూ శనిదేవుడి యంత్రం ఉండేలా చూసుకోండి.
ఇంటి సింహద్వారం వద్ద పచ్చి మిరపకాయలు, నిమ్మకాయలు వేలాడదీయండి.
శనివారం రోజు ఇలా చేయండి.
ఇంట్లో అక్వేరియంలో 2 బంగారు చేపలను పెంచండి.
ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి నమస్కరించండి.
ప్రతిరోజూ 'ఆదిత్య హృదయ స్రోత్రం'ను చదవండి.
ప్రతిరోజూ సూర్యుడికి నీటిని సమర్పించడంవల్ల కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఆహారాన్ని తూర్పు దిక్కున కూర్చొని తినండి.
ఇంటి కిటికీలను ఎప్పుడూ తెరిచివుంచాలి.
ఇలా చేస్తే సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
కుక్కలకు బిస్కెట్లు పెట్టండి. మంచినీరు పోయండి.
మీ ఇష్టం.. అవి తినగలిగేవి పెట్టండి.
ఆవులకు పచ్చి గడ్డి వేయండి.
మూగజీవాలపై ఎప్పుడూ ప్రేమను చూపండి.
అవి మీ దగ్గరకు వస్తుంటే విదిలించొద్దు.
కుక్కలు ఎవరినీ ఏమీ చేయవు.
చాలామంది మనుషులను చూసి అరుస్తున్నాయనుకుంటారు.
కానీ అది ఇంకో కుక్కను చూసి అరుస్తుందనే విషయాన్ని తెలుసుకోండి.
ఇంట్లో కిటికీకి మీ వెన్ను ఆనించొద్దు.
దీనివల్ల మీ శక్తి తగ్గిపోతుంది.
ప్రతిరోజు ఉదయాన్ని గాయత్రి మంత్రం పఠించండి.
ఇంట్లో గోడకు ఒక పర్వత చిత్రాన్ని ఉంచండి.
అంతా సానుకూలంగా ఆలోచించేవారితోనే సమయాన్ని గడపండి.
తమ తప్పులను తెలుసుకోకుండా, ఇతరుల తప్పులను వెతికేవారితో సమయాన్ని గడపొద్దు.












Click it and Unblock the Notifications