నవంబరు నెలలో బాగా కలిసివచ్చి అదృష్టవంతులయ్యే రాశులు వీరే

గ్రహాల సంచారం ప్రకారం నవంబరు నెల చాలా కీలకమైన నెల. సంపదకు, శ్రేయస్సుకు, కళలకు, అందానికి, ఫ్యాషన్ రంగాలకు కారకుడయ్యే శుక్రుడు నవంబరు రెండో తేదీన తులారాశిలోకి సంచారం చేస్తాడు. అదే నెల 25వ తేదీ వరకు ఆ రాశిలోనే సంచారం చేస్తుంది. శుక్రుడు రాక్షులకు గురువు. కానీ మానవులకు సంపదను ప్రసాదిస్తాడు. అనుకున్న పనుల్లో విజయాలు సాధించడానికి తోడ్పడతాడు. తులారాశిలోకి సంచారం చేయడంవల్ల ఏయే రాశులకు ఏ విధంగా కలిసివస్తుందనే విషయాలను తెలుసుకుందాం.

తులారాశి
కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మాట్లాడే తీరు చాలా బాగుంటుంది. ఎదుటివారిని ఆకట్టుకుంటారు. దాంపత్య జీవితం గతంలోకంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. చిన్న చిన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. వ్యాపారస్తుల పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. కెరీర్ పరంగా ఉద్యోగస్థులకు ఊహించనిరీతిలో లాభాలు కలుగుతాయి.

These are the zodiac signs that will be lucky to get along well in the month of November

కుంభ రాశి
ఈసమయంలో ఈ రాశివారికి అదృష్టం అద్భుతంగా కలిసివస్తుంది. గతంలో ఇక రాదు అనుకున్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ప్రయాణాలు చేయడంవల్ల వీరికి మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా కలిసివస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సంపద అనూహ్యంగా పెరుగుతుంది. డబ్బు రావడానికి అనేక మార్గాలు దొరుకుతాయి. మీకు కనిపించని రీతిలో కూడా డబ్బు వచ్చేస్తుంది.

మకర రాశి
ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులున్నాయి. ఆదాయం భారీగా పెరుగుతుంది. కెరీర్ పరంగా మంచి విజయాలు సాధిస్తారు. మానసికంగా ఎదురవుతున్న ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. అదృష్టం కలిసివచ్చు శుక్రుడి వల్ల అందలం ఎక్కుతారు. ఉద్యోగస్థులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఊహించనిరీతిలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. కెరీర్ పరంగా అందలం ఎక్కుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+