3 సంవత్సరాల వరకు ఈ రాశులవారికి తిరుగులేదు

శని ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడానికి సుమారు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలోకి ప్రవేశించింది. ప్రస్తుతం శని తిరోగమనంలో ఉన్నాడు. 2025 వరకు అక్కడే ఉంటాడు. తర్వాత కుంభరాశిని వదిలి మరో రాశిలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి అదృష్టకాలం అని చెప్పవచ్చు. ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.

మేషరాశి:
మేష రాశివారికి బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ ఈ సమయంలో పూర్తిచేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు కూడా ఆర్థికంగా కలిసివస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఈ రాశికి చెందినవారి పేరు మార్మోగుతుంది.

 zodiac

వృషభరాశి:
శని కుంభరాశిలో ఉండటంవల్ల ఈ రాశివారికి అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఊహించనిరీతిలో భారీ ఆర్డర్లు అందుకుంటారు. ఉద్యోగస్తులకు వారి పనిచేసే ప్రాంతంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది. కుటుంబ సభ్యులతో అధిక సమయం వెచ్చిస్తారు.

సింహరాశి:
ఈ రాశులవారి వైవాహిక జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. 7వ ఇంట్లో శని వల్ల వివిధ రంగాల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా ప్రయోజనాలున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి ఊహించనిరీతిలో మద్దతు లభిస్తుంది. అడుగు పెట్టిన అన్ని రంగాల్లోను విజయవంతమవుతారు.

తుల రాశి:
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారంలో విజయం సాధిస్తారు. భాగస్వామ్యంతో ఉన్న వ్యాపారం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చెప్పి సలహా, సూచనలతో చేసిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి.

వృశ్చికరాశి:
డబ్బును భారీ మొత్తంలో ఆర్జిస్తారు. జీవన స్థితిగతులు కూడా మెరుగవుతాయి. శని కుంభరాశిలో ఉండటంవల్ల అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగపరంగా మంచి పురోగతి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+