జూన్ నెల ఈ 5 రాశులవారికి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెస్తోంది
జూన్ 24వ తేదీన బుధుడు వృషభరాశి నుంచి మిథునరాశిలోకి వెళతాడు. జూన్ 15న వృషభరాశి నుంచి మిథునరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. అనంతరం శని జూన్ 17 న కుంభరాశిలో తిరోగమనం చేస్తాడు. జూన్ 30న కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రధానమైన నాలుగు గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి. బుధుడు తన రాశిని రెండుసార్లు మార్చబోతున్నాడు. జూన్ 7వ తేదీన మేషరాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల 5 రాశులవారికి కలిసివస్తోంది. ఏయే రాశులవారికి అనేది తెలుసుకుందాం.
మేష రాశి:నాలుగు గ్రహాల మార్పు ఈ రాశివారికి లాభదాయకంగా ఉంటుంది. విదేశాల నుంచి అవకాశాలందుతాయి. మంచి వ్యక్తులతో పరిచయ భాగ్యం కలుగుతుంది. గ్రహాల శుభ ప్రభావం వల్ల ఆత్మవిశ్వాస స్థాయులు పెరుగుతాయి.

మిథున రాశి:విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. మనస్సు ఏకాగ్రతతో ఉండడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి ఊహించనిరీతిలో మద్దతుంటుంది. ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కన్యారాశి:కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఫలాలనివ్వడం ప్రారంభిస్తాయి. కొత్త వాహనాలను కొనగోలు చేయడంతోపాటు తల్లిదండ్రులను తీర్థయాత్రకు తీసుకువెళతారు.
తులారాశి:ఎక్కువ కాలం తర్వాత వీరికి గ్రహాల మద్దతు లభిస్తోంది. గతం నుంచి రావు అనుకున్న డబ్బులు తిరిగివస్తాయి. వ్యాపారం బాగుంటుంది. పిల్లల్లో అభివృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఎక్కువ దూరం ప్రయాణం చేసే అవకాశం ఉంది.
మకర రాశి:ఈ సమయం బాగా కలిసివస్తుంది. ఆదాయం పెరగడంతోపాటు జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. న్యాయపరమైన అంశాల్లో విజయం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.












Click it and Unblock the Notifications