ఈ రాశులవారికి ఆరోజు నుంచి విముక్తి.. తర్వాత ధనలక్ష్మీ కటాక్షమే
రాహు, కేతు గ్రహాలను అశుభ గ్రహాలుగా జ్యోతిష్యం పరిగణిస్తుంది. అన్ని గ్రహాలు సవ్యదిశలో పయనిస్తే రాహు, కేతు గ్రహాలు అపసవ్య దిశలో పయనిస్తాయి. ఆధ్యాత్మికత, మోక్షం, నిశ్చబ్దం.. తదితరాలకు ఇవి కారకులు. ఈ రెండూ అశుభ ఫలితాలే కాదు శుభ ఫలితాలు కూడా ఇస్తాయి.
ఈనెల 30వ తేదీన ఇవి తమ గమనాన్ని మార్చుకుంటాయి. రాహువు మీనరాశిలోకి, కేతువు కన్యారాశిలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల కొందరికి శుభ, మరికొందరికి అశుభ ఫలితాలుంటాయి. ఇవి నెమ్మదిగా కదలడంతోపాటు రాశిని మార్చడానికి ఏడాదిన్నర సమయం తీసుకుంటాయి. రాహు-కేతువ గమనంలో మార్పులవల్ల ఎవరెవరికి మంచి రోజులు వస్తాయో తెలుసుకుందాం.

మేషరాశి
సానుకూల విషయాల గురించే ఆలోచించాలి. దీనివల్ల విజయం సాధిస్తారు. ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో సమయాన్ని వృథా చేస్తారు. ప్రేమలో నిరాశ చెందుతారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ నెల చాలా కష్టంగా గడుస్తుంది. నిరంతరం చేసే ప్రయత్నాలవల్ల విజయాలు లభ్యమవుతాయి. కుటుంబ సౌఖ్యాలు పెరగడంతోపాటు సంతోషకరమైన వాతావరణం చోటుచేసుకుంటుంది. పనిలో అడ్డంకులేర్పడతాయి. శ్రమద్వారా వీటిని తొలగించుకోవాల్సి ఉంటుంది. హనుమంతుడిని పూజించడంద్వారా మంచి ఫలితాలు పొందుతారు.
తుల రాశి
శుభవార్త అందుతుంది. ఈ నెల గడిచిన తర్వాత డబ్బుకు కొరత ఉండదు. వైవాహిక జీవితం బాగుంటుంది. విద్యారంగంతో అనుబంధం ఉన్నవారు విజయం సాధించడంతోపాటు గతంలో మొదలై నిలిచిపోయిన పనులను కూడా పూర్తిచేస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. చుట్టుపక్కల అంతా పాజిటివ్ తో కూడుకున్న వాతావరణమే ఉంటుంది. అంతేకాకుండా కొన్ని పనులు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు.












Click it and Unblock the Notifications