2025 వరకు వీరిపై కనక వర్షం
మంచి పనులు చేస్తే అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు శని దేవుడు. తప్పుడు పనులు చేస్తే శిక్షలు వేస్తాడు. సాధారణంగా శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. ఈ సంవత్సరం జనవరిలో తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించాడు. 2025 వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలను కలగజేస్తున్నాడు. ఏయే రాశులవారనే వివరాలను తెలుసుకుందాం.
కుంభరాశి
ప్రస్తుతం ఈ రాశిలోనే శని సంచరిస్తున్నాడు. 2025 వరకు వీరు ఒకరకంగా మహారాజులే అని చెప్పవచ్చు. శష్ రాజయోగంవల్ల సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడించడంతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇబ్బంది పెడుతున్న కోర్టు కేసుల్లో విజయం దక్కుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటంవల్ల లైఫ్ స్టైల్ మారుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఊహించనిరీతిలో మద్దతు దొరుకుతుంది.

వృషభరాశి
వీరు చేసే ప్రతి పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మతపరమైన, ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలపట్ల ఆసక్తిని చూపిస్తారు. ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల ఆర్థికంగా బలపడతారు. ఇల్లు లేదంటే వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.
తులారాశి
కెరీర్ లో మంచి ఎదుగుదల ఉంటుంది. వివాహం కానివారికి సంబంధాలు కుదురుతాయి. పిల్లలు లేనివారికి సంతాన యోగం ఉంది. ప్రేమ జీవితం విజయవంతమవుతుంది. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.












Click it and Unblock the Notifications