అరుదైన భద్ర రాజయోగంతో ఈ రాశుల వారికి అదృష్టకాలం
మేథాశక్తికి ప్రతీక అయిన బుధుడు దాదాపు ఏడాది తర్వాత తన సొంత రాశి అయిన కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల భద్ర రాజయోగం ఏర్పడబోతోంది. జాతకంలో భద్ర రాజయోగం ఉన్న వ్యక్తులు భౌతిక ఆనందాలను పొందుతారు. తెలివితేటలు పెరుగుతాయి. సంభాషణ శైలి కూడా మారుతుంది. వ్యాపారంలో బాగా కలిసివస్తుంది. ఈ భద్ర రాజయోగంవల్ల మూడు రాశులకు ప్రధానంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
కన్యా రాశి : బుధుడి సంచారం వీరికి బాగా కలిసి రానుంది. జాతకంలో లగ్నస్థితిలో భద్ర రాజయోగం ఏర్పడబోతోంది. ఈ సమయంలో వీరి వ్యక్తిత్వం వికసిస్తుంది. జీవితంలో ప్రేమ, ఆకర్షణ పెరుగుతాయి. జీవిత భాగస్వామి మంచి పురోగతిలో ఉంటారు. భాగస్వామి నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే భాగస్వామ్యంతో ఉన్న పని నుంచి లాభం ఉంటుంది. వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

ధనుస్సు రాశి : భద్ర రాజయోగం వీరికి రాజయోగాన్ని కల్పించబోతోంది. ఈ రాశితో కర్మభావంలో ఇది ఏర్పడబోతోంది. దీనివల్ల ఉద్యోగం లేనివారికి ఉద్యోగం లభిస్తుంది. ఇంక్రిమెంట్లు, పదోన్నతులు లభిస్తాయి. పనిచేసేచోట ఇతర ఉద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. గతంలో కంటే ఇప్పుడే వారి నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపారవేత్తలకు మంచి ఆర్డర్లు వస్తాయి. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications