బుధుడి సంచారం.. ఈ రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం
నవంబరు ఆరోతేదీ సాయంత్రం 4.32 గంటలకు వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన బుధుడు ఈనెల 27వ తేదీ ఉదయం 6.02 గంటలకు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. మేథస్సుకు, వాక్కుకు, ఏకాగ్రతకు, చురుకుదనానికి బుధుడు కారకుడు. రాబోయే మూడు వారాలు కొన్ని రాశులవారి జీవితాల్లో ఆనందం వెల్లివిరియనుంది. ఏయే రాశులవారికి కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మకర రాశి : ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి అన్నీ శుభాలే కలుగుతాయి. డబ్బులు ఆదా చేయడంవల్ల భవిష్యత్తులో మంచి లాభాలను పొందుతారు. పెట్టుబడులు పెట్టేవారికి ఆర్థికంగా మంచి ప్రయోజనాలున్నాయి. జీవిత భాగస్వామి సలహాతో చేసే పనులు విజయవంతమవుతాయి.

కుంభం : బుధుడి సంచారంవల్ల వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎలాంటి పనిలోనైనా గెలుపొందుతారు. ప్రేమకు సంబంధించిన జీవితం బాగుంటుంది. ఆర్థికంగా లాభాలున్నాయి. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.
వృశ్చిక రాశి : వీరికి అదృష్టం రెట్టింపు అవుతుంది. కొన్ని పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. ఉద్యోగాలు చేసేవారు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకోవడతోపాటు తమ పనితీరుతో ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.
మేష రాశి : ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలున్నాయి. పెట్టుబడులు పెట్టకుండా ఊరక ఉండటం ఉత్తమం. ప్రయాణం చేసేటప్పుడు అన్నివిధాలుగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి : మనసు ప్రశాంతంగా ఉండటంవల్ల సంతోషాన్ని అనుభవిస్తారు. ఉద్యోగంలో ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభిస్తుంది. పై అధికారుల మద్దతువల్ల విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
సింహరాశి : మనసు ఆనందమయంగా మారుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో గడపడానికే అధిక సమయాన్ని వెచ్చిస్తారు.












Click it and Unblock the Notifications