చతుర్గ్రాహి యోగంతో ఈ రాశులవారికి అద్భుత యోగం
చంద్రుడు, అంగారకుడు రాశులు మారుస్తున్నారు. చంద్రుడు, కుజుడు.. ఇద్దరూ కన్యారాశిలోకి ప్రవేశిస్తారు. ఇప్పటికే చంద్రుడు, మార్స్, మెర్క్యురీ ఇదే రాశిలో ఉన్నారు. ఒకేసారి నాలుగు గ్రహాల కలయికవల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. దీనివల్ల విశేష ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆకస్మిక ధనలాభంతోపాటు ఉద్యోగం ప్రమోషన్ పొందుతారు. ఏయే రాశులవారికి బాగా కలిసిరానుందో తెలుసుకుందాం.
వృషభ రాశి: గ్రహాల కూటమి వృషభరాశి నాలుగో ఇంట్లో జరుగుతోంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది. ఇది కల్పించిన ఆత్మవిశ్వాసంతో అపారమైన సంపదను పొందుతారు. అనారోగ్యం దూరమవుతుంది. గతంలో మొదలై పూర్తికాకుండా ఉండిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

మిథున రాశి: ఈ రాశి మూడో ఇంట్లో చతుర్గ్రాహీ యోగం ఏర్పడుతోంది. చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. ఏ పని తలపెట్టినా పూర్తి ఆత్మవిశ్వాసంతో చేస్తారు. అటువంటి స్థితిలో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. ఉద్యోగస్తులు ప్రయోజనాలు పొందుతారు.
తుల రాశి: ఈ రాశి 11వ ఇంట్లో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. చేపట్టే పనిని అందరూ అభినందిస్తారు. నాయకత్వం వహించే సామర్థ్యం పెరుగుతుంది. కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తుంటే ఈ సమయం అందుకు చాలామంచిది. విజయం ఖాయం. అలాగే ఆకస్మిక ధనలాభాలున్నాయి.
వృశ్చిక రాశి: 10వ ఇంట చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. ఈ రాశివారు మంచి పురోగతి సాధిస్తారు. కార్యాలయంలో చేసే పనిపట్ల పై అధికారులు సంతృప్తి చెందుతారు. ఇంక్రిమెంట్ తో కూడిన ప్రమోషన్ పొందుతారు. కొత్త ఆదాయమార్గాలు లభ్యమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఊహించనిరీతిలో మద్దతు దొరుకుతుంది. జీవిత భాగస్వామితో చెప్పి చేయడంవల్ల పని విజయవంతమవుతుంది.












Click it and Unblock the Notifications