బుధుడు, గురుడి వీక్షణ.. ఈ రాశులవారికి అరుదైన యోగం

జ్యోతిష్యం ప్రకారం బుధుడు, గురుడు పరస్పరం చూసుకున్నా, కలిసివున్నా అది ఒక భాగ్యమని చెబుతారు. గురువు జ్ఞానకారకుడు కాగా, బుధుడు బుద్ధి, విజ్ఞాన కారకుడు. అందువల్ల ఈ రెండు గ్రహాల కలయికకు, పరస్పర వీక్షణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇది గ్రహ సంచారానికి కూడా వర్తిస్తుంది. ఈ సమయంలో ఎటువంటి పని తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. ఆదాయంలో, అధికారంలో మార్పులు జరుగుతాయి. ప్రధానంగా ఏడు రాశులకు ఈ యోగంబాగుంటుంది.

మేష రాశి:సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం వ్యాపారాన్ని ఎంచుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఊహించనిరీతిలో సంపూర్ణ మద్దతు లభిస్తుంది.

good news for using reliance jio customers

మిథునరాశి:ప్రతిభా పాటవాలు వికసిస్తాయి. వృత్తి, వ్యాపారం వృద్ధి చెందుతాయి. సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఆలోచనలు, అభిప్రాయాలు కుటుంబ పరిస్థితులతోపాటు వృత్తి, ఉద్యోగాలను ప్రభావితం చేస్తాయి.

కర్కాటకరాశి:విద్యార్థులు ఉన్నత విద్యలో ఘనవిజయం సాధిస్తారు. సామాజికంగా హోదా పెరుగుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతారు.

తులా రాశి:వృత్తి, వ్యాపారానికి సంబంధించిన ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది. జీవిత భాగస్వామికూడా చాలా బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలున్నాయి. ప్రతి రంగంలో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. మనసులో కోరిక నెరవేరుతుంది.

ధనుస్సురాశి:ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వృత్తి, ఉద్యోగానికి సంబంధించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి.

మకరరాశి:సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అవి లాభసాటిగా ఉంటాయి. సామాజికంగా హోదా పెరుగుతుంది.

మీనరాశి:ఆకస్మిక ధనలాభం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా బయట కూడా మాటలకు, చేతులకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+