కొత్త ఏడాదికి 3 రోజులముందే వీరికి కుబేర యోగం
మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సరం వస్తోంది. కొత్త ఏడాదిలో గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. నూతన సంవత్సరానికి ముందే ఓ గ్రహం గమనంలో భారీ మార్పులు రాబోతున్నాయి. డిసెంబరు 31 ముందు గ్రహాల పెద్దన్న అయిన బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. గురుడు ప్రత్యక్ష సంచారం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉండబోతోందనే వివరాలను తెలుసుకుందాం.
మేష రాశి : ఈ రాశిలో బృహస్పతి సంచారం జరగబోతుంది. ఇది మేష రాశి వారికి అనేక లాభాలను కలిగించనుంది. వీరి కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఉన్న గొడవలు సద్దుమణుగుతాయి. కోరికలన్నీ నేరవేరడంతోపాటు ఆదాయాన్ని పెంచుకుంటారు. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.

ధనస్సు రాశి : బృహస్పతి రివర్స్ కదలిక ధనస్సు రాశి వారికి బాగుంటుంది. అదృష్టం వరిస్తుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు లాభాలు కళ్లజూస్తారు. మతపరమైన లేదంటే ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాటిపై ఆసక్తి కలుగుతుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆగిపోయిన పనులు వెంటనే ప్రారంభమవుతాయి. కెరీర్ లో ఎదుగుదల ఉండటంతోపాటు వైవాహిక జీవితం బాగుంటుంది.
సింహరాశి : గురుడి సంచారం సింహరాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వనుంది. ప్రేమ విషయం సక్సెస్ అవుతుంది. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. వీరితో గడపడానికే అధిక సమయాన్ని వెచ్చిస్తారు.












Click it and Unblock the Notifications