మేషరాశిలో గురుడు-చంద్రుడు కలయిక.. ఈ 3 రాశులవారికి ఐశ్వర్యం
జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు, దేవగురు బృహస్పతి ఈనెల 10వ తేదీన మేషరాశిలో కలవనున్నారు. ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని రాశులవారికి మంచి ప్రయోజనాలను చేకూర్చనుంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడంతోపాటు ఆర్థికంగా లాభపడతారు. గురువు, చంద్రుడి సంయోగం ఏయే రాశులకు కలిసిరానుందో వివరాలు తెలుసుకుందాం.
కర్కాటక రాశి : మేషరాశిలో గురుడు, చంద్రుడి కలయికతో కర్కాటకరాశివారికి శుభ సమయం రాబోతోంది. పలు మార్గాలద్వారా సంపాదనకు మార్గాలు తెరుచుకుంటాయి. దీనివల్ల ఆర్థికంగా లాభపడతారు. కుటుంబ సభ్యుల నుంచి ఊహించనిరీతిలో మద్దతు లభిస్తుంది. దీనివల్ల ఒత్తిడి దూరమవుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. పనిచేసేచోట మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు పదోన్నతి లభిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.

ధనుస్సు రాశి : మేషరాశిలో గురుడు, చంద్రుడి కలయిక ధనుస్సు రాశివారికి ఎంతో మేలు చేయనుంది. గతంలో ప్రారంభించి ఆగిపోయిన పనులన్నీ తాజాగా పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. కుటుంబ సభ్యల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆధ్యాత్మిక యాత్రలకు వెళతారు. సంతానం లేనివారికి పిల్లలు కలుగుతారు. అంతేకాదు.. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ప్రేమ సంబంధం విజయవంతమవుతుంది. ఆదాయం కూడా పెరిగి డబుల్ అవుతుంది.
మేషరాశి : మేషరాశిలో గురుడు, చంద్రుడి కలయిక మేషరాశివారికి బాగా కలిసివస్తుంది. పనిచేసేచోట మీ శ్రమకు పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులమధ్య అనుబంధం బలపడుతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలోనే పూర్తిచేయగులుగుతారు. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.












Click it and Unblock the Notifications