కన్యారాశిలోకి అంగారకుడు.. ఊహించని ధన లాభాన్ని పొందుతున్న రాశులు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతుంటుంది. దీని ప్రభావం అన్ని రాశులవారిపై ఉంటుంది. భూమి కుమారుడు కుజుడు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్న సమయంలోనే ఈ రాశిని బుధుడు పాలించబోతున్నాడు. కుజుడు బుధునితో శత్రు భావం కలిగి ఉంటాడు. అప్పుడప్పుడు కుజుడు రాశి మారుస్తుండటంవల్ల ఆకస్మిక ధనలాభాలుంటాయి. ఈ అదృష్టాన్ని పొందబోయే రాశులవారు ఎవరో తెలుసుకుందాం.
మీన రాశి : అంగారకుడు రాశిని మార్చడం వీరికి కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి నుంచి వీరికి పూర్తి మద్దతు లభిస్తుంది. కొంచెం ఒత్తిడి ఉన్నప్పటి తట్టుకోగలుగుతారు. వారసత్వంగా కుటుంబ వ్యాపారం చేస్తున్నవారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రచిస్తారు.ఒంటరి జీవితాన్ని గడుపుతున్నవారు ఈ సమయంలో ప్రత్యేక వ్యక్తిని కలుస్తారు. నిరుద్యోగులకు బాగుంటుంది. అంగారకుడు సంపదకు, అదృష్టానికి అధిపతి. దీనివల్ల ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అదృష్టం ఎప్పుడూ వెంటే ఉంటుంది.

మకర రాశి : అంగారకుడి సంచారం మకర రాశివారికి విశేష ప్రయోజనాలను తీసుకురాబోతోంది. ఈ సంచారం కూడా అదృష్ట ప్రదేశంలోనే జరగబోతోంది. గతంలో మొదలై ఆగిపోయిన పనులు పూర్తిచేయగలుగుతారు. పని-వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం ఉంటుంది. వ్యక్తిగత జీవితంతోపాటు వృత్తి జీవితంలో కొనసాగుతున్న వారు సమస్యల నుండి బయటపడే స్వేచ్ఛ దొరుకుతుంది. ఇంట్లో కొన్ని శుభ, మతపరమైన కార్యక్రమాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఈ సమయంలోనే అవకాశం లభిస్తుంది.












Click it and Unblock the Notifications