ఈ రాశులవారిపై కనక వర్షం కురిపించనున్న మంగళ-కేతు గ్రహాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశి నిర్ధేశిత సమయంలో ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి సంచరిస్తుంటుంది. దీన్ని రాశి పరివర్తనం లేదంటే గ్రహాల గోచారమంటారు. కొన్ని గ్రహాలు నెలకు, రెండు నెలలకు, మరికొన్ని ఏడాదికోసారి లేదా ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటాయి. మంగళ గ్రహం త్వరలోనే తులా రాశిలో ప్రవేశిస్తూనే మంగళ కేతు యుతి ఏర్పరచనుంది.
మంగళ గ్రహం తులారాశిలో అక్టోబరు 3వ తేదీన ప్రవేశిస్తుంది. ఆ సమయానికి అదే రాశిలో ఉన్న కేతుతో సంయోగమవుతుంది. అక్టోబరు 30వ తేదీ వరకు తులా రాశిలోనే ఉండటంవల్ల మూడోతేదీ నుంచి నెలాఖరు(30వ తేదీ) వరకు అన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. మంగళ, కేత గ్రహాల యోగంతో ఈ మూడు రాశులకు ధనలాభం కలగనుంది. అంతేకాకుండా మంచిరోజులు ప్రారంభమవుతాయి. ఏయే రాశులకు కలిసిరానుందో వివరాలు తెలుసుకుందాం.

సింహ రాశి: వీరికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉండేవారికి అత్యంత అనుకూలం. మాటతీరులో మార్పుంటే మంచి జరుగుతుంది. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా బలోపేతమవుతారు.
మకర రాశి: ఏ పని తలపెట్టిన విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ఉద్యోగం చేసేవారికి కొత్త అవకాశాలు తలుపు తట్టడంతోపాటు ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు రావు. ఆరోగ్యంపట్ల శ్రద్ధ ఉండాలి.
కన్యారాశి: మధ్యలో నిలిచిపోయిన డబ్బులు ఈ సమయంలో చేతికి అందుతాయి. నటన, పాటలు, మార్కెటింగ్, మీడియా, కళ రంగాల్లో ఉన్నవారికి బాగుంటుంది. ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఊహించని రీతిలో ధనలాభం ఉంది.












Click it and Unblock the Notifications