రాహు మహాదశ: 18 ఏళ్లు వీరికి తిరుగే లేదు
జ్యోతిష్యం ప్రకారం రాహువును పాప గ్రహంగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో రాహువు బలంగా ఉంటారో వారు అన్ని రంగాల్లోను విజయం సాధిస్తారు. బలహీనంగా ఉంటే దష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే రాహువును రాక్షసుడు అని కూడా పిలుస్తారు. ఎవరి జాతకంలో అయితే రాహువు ఐదు, ఏడు, తొమ్మిదో స్థానంలో ఉంటాడో వారిపై రాహువు ప్రభావం ఎక్కువ. రాహువు మహాదశ దాదాపు 18 సంవత్సరాలు ఉంటుంది. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. రాశిచక్రాలపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
రాహువు శుభస్థానంలో ఉండటంవల్ల సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగాల్లో ఉండే వారు విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. కెరీర్ లో పురోగతి ఉంటుంది. రాహువు మహాదశ 18 సంవత్సరాలు ఉంటుంది. రాహువు బలహీనంగా ఉండటంవల్ల ఇతరులను మోసం చేసే అవకాశాలుంటాయి. చెడు అలవాట్ల బారిన పడొచ్చు. జీవితంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. రాహువు అశుభ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్య పరంగా వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రాహువు మహాదశ పరిహారాలు..
రాహువు మహాదశతో ఇబ్బంది పడేవారు బుధవారం రోజు ఏడురకాల ధాన్యాలు, గాజుపాత్రలను, స్తోమతకు తగ్గట్లుగా దుస్తులు దానం చేయాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఉప్పు కలిపిన నీళ్లతో చేతులు, కాళ్లను శుభ్రం చేసుకోవాలి. రాహువు యంత్రాన్ని నిత్యం పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అదేరోజు నల్ల కుక్కకు రోటీ తినిపించడం వల్ల రాహు మహాదశ ప్రభావం తగ్గుతుంది.
మకర రాశి
మహాదశతో వీరికి మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. అన్ని రంగాల్లో విజయం సాధించడంతోపాటు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. వ్యాపారంలో, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇది అనుకూల సమయం. ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి.












Click it and Unblock the Notifications