వచ్చే నెలలో రాహువు సంచారం.. తోడుగా ధనపు రాశులు

జ్యోతిష్యం ప్రకారం రాహువును అనేక రకాల పేర్లతో పిలుస్తారు. ఛాయా గ్రహం, పాపగ్రహం, దుష్ట గ్రహం, క్రూర గ్రహం.. ఇలా పలు పేర్లున్నాయి. వాస్తవానికి రాహువు ఎప్పుడూ ప్రతికూల ఫలితాలనే ఇస్తుంటాడు. కొన్నిసార్లు మంచి శుభ ఫలితాలను ఇస్తాడు. వచ్చే నెల 30వ తేదీన రాహువు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల కొందరికి అదృష్టం వరించనుంది. రాహువు-కేతువు ఎప్పుడూ రివర్స్ లో కదులుతుంటాయి. ఏడాదిన్నరకోసారి మాత్రమే రాశిని మారుస్తాయి. ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్న రాహువు మీనరాశిలోకి ప్రవేశించబోతుంది. దీనివల్ల కలిసివచ్చే రాశులవారి వివరాలను తెలుసుకుందాం.

కన్యా రాశి: వీరికి ఊహించని లాభాలుంటాయి. ఏ పనిని తలపెట్టినా విజయవంతంగా పూర్తిచేస్తారు. కెరీర్ లో కొత్త కొత్త అవకాశాలు తలుపు తడతాయి. జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వ్యాపారస్తులకు భారీగా లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ వస్తుంది. జీవిత భాగస్వామితో చెప్పి చేసే పనులు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ పూర్తిచేయడానికి ఇది మంచి సమయం.

these zodiac sign people are very lucky due to Rahu transit effect 2023

మకరరాశి: కెరీర్ బాగుంటుంది. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అంతేకాదు.. ఆదాయం కూడా పెరుగుతుంది. ఏ పని తలపెట్టిన విజయవంతంగా పూర్తిచేస్తారు. జీవితం ఆనందమయంగా సాగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనేక ప్రయోజనాలున్నాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

వృషభ రాశి: వీరికి మంచిరోజులు ప్రారంభమయ్యాయి. కెరీర్ చాలా బాగుంటుంది. ఊహించని రీతిలో ధనలాభం ఉండబోతోంది. ఆర్థిక పరిస్థితి బలపడటంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. చేపట్టే ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవి లభించే అవకాశం కనపడుతోంది. పెట్టుబడిదారులకు మంచి లాభాలను ఇస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+