ఈ రాశులపై సూర్యుడి కనక వర్షం
ఈ ఏడాది మకర రాశికి ఎంతో ప్రాముఖ్యత పెరిగింది. దీనికి కారణం రవి యోగం ఏర్పడటమే. 77 సంవత్సరాల తర్వాత ఇది వచ్చింది. 15వ తేదీ తెల్లవారుజామున 2.43 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంవల్లే మకర సంక్రాంతి పండగను జరుపుకుంటారు. జ్యోతిష్యం ప్రకారం కూడా ఈ పండగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
మేషరాశి:వీరికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆస్తులను కొనుగోలు చేస్తారు. దీనివల్ల సంపాదన రెట్టింపవుతుంది. వృత్తి జీవితంలో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. ఉద్యోగాలు చేస్తున్నవారికి తమ యజమానుల నుంచి మద్దతు లభించి ప్రమోషన్లు పొందుతారు. పనితీరుకు వారి వారి కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు.

వృషభ రాశి:ఉద్యోగస్తులకు ఊహించని లాభాలున్నాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలుంటే అవి ఈ సమయంలో పరిష్కారమవుతాయి. కెరీర్ పరంగా అనేక విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో కూడిన ప్రమోషన్ ఉంది.
కర్కాటక రాశి:వీరికి లాభనష్టాలు రెండూ ఉన్నాయి. కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో ఉన్నవారి సమస్యలు పరిష్కారమవుతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
సింహరాశి:విద్యార్థులకు బాగుంటుంది. పోటీ పరీక్షలవల్ల మంచి ర్యాంకులు పొందుతారు. ఆర్థికంగా మెరుగవుతారు. పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోయి లాభాలు వస్తాయి.
కన్యారాశి:పిల్లల దగ్గర నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు దొరకడంతో ఏ పనినైనా సులువుగా చేసేస్తారు. విద్యార్థులకు బాగుంటుంది. గతంలో ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications