31న చతుర్గ్రాహి యోగం.. ఈ రాశులకు ధనయోగం
జ్యోతిష్యం ప్రకారం గురుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. వచ్చే ఏడాది వరకు అక్కడే ఉంటాడు. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ఈనెల 14వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే అక్కడ శుక్రుడు ఉన్నాడు. ఈనెల 31వ తేదీ వరకు ఇదే గ్రహంలోకి బుధుడు కూడా సంచరించనున్నాడు. దీనివల్ల 31వ తేదీన చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
వృషభ రాశి
చతుర్గ్రాహి యోగం వల్ల కఠినమైన పనులు కూడా సులభంగా అవుతాయి. సోదరులతో అనుబంధం బలపడుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తిచేయడానికి ఇది మంచి సమయం. కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలు చేసేవారు తమ తెలివితేటలతో పనులను నైపుణ్యంగా పూర్తిచేస్తారు. పనుల్లో మెరుగుదల ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. వ్యాపారాలు చేసేవారు భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

కర్కాటక రాశి
చతుర్గ్రాహి యోగంవల్ల దరిద్రం నుంచి విముక్తి లభిస్తుంది. సానుకూల వాతావరణంతో అన్ని పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మనసు సంతోషంతో నిండిపోతుంది. వ్యాపారాలు చేసేవారికి విదేశీ ఒప్పందాలతో బిజీగా జీవనాన్ని కొనసాగిస్తారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఇది మంచి సమయం. కెరీర్ కు సంబంధించి అద్భుత నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది.
మకర రాశి
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళతారు. కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి కఠినమైన పనులు కూడా చేస్తారు. కొత్తగా ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారల్లో నష్టాలను ఎదుర్కొంటున్నవారికి ఈ సమయం కాస్తంత ఉపశమనం కల్పిస్తుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుదలతోపాటు ప్రమోషన్ ఉంది. పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తారు.












Click it and Unblock the Notifications