స్థిర రాశుల్లో శని, గురువు.. విపరీతమైన ధనలాభం
శని అనుకూలంగా ఉంటే విదేశీ యోగాలు ఏర్పడతాయి. ప్రస్తుతం శని తన స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నాడు, గురువు, శుక్రుడు వృషభరాశిలో సంచారం చేస్తున్నారు. దీనివల్ల రాశులవారికి ఉద్యోగ అవకాశాలు బాగా కలిసివస్తాయి. వచ్చే ఏడాది మే వరకు గురువు, శని స్థిర రాశుల్లోనే సంచారం చేస్తుండటంవల్ల విదేశీ ఉద్యోగ అవకాశాలకన్నా స్వదేశీ ఉద్యోగ అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఏయే రాశులకు ఏవిధంగా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభం
విదేశాల్లో ఉద్యోగ అవకాశం లేదు. ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉండదు. ఓ సంవత్సరంపాటు స్వదేశంలోనే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్నవారు మాత్రం అక్కడే స్థిరపడే అవకాశం ఉంది.

సింహం
స్వదేశంలోనే, సొంత ఊరిలోనే ఉద్యోగం సంపాదించుకుంటారు. చిన్న ప్రయత్నంతోనే వారు దీన్ని సాధిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగంవల్ల ధనలాభం ఎక్కువగా ఉంది.
కన్య
శుభ గ్రహాలైన గురుడు, శుక్రుడు ఈ రాశిలోనే ఉన్నారు. ఉద్యోగ పరంగా విదేశీ అవకాశం లేదు. సొంత ఊరిలోనే లభిస్తుంది. అయితే ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లివచ్చే అవకాశం మాత్రం ఉంది. ఇంటర్వ్యూలతోపాటు పటీ పరీక్షల్లో నెగ్గి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకునే అవకాశాలున్నాయి.
వృశ్చికం
స్వదేశంలోనే దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. ధనలాభం అధికంగా ఉంటుంది. ఉద్యోగం మారడానికి అవకాశం లేదు. ఉద్యోగ భద్రత బాగుంది. అలాగే స్థిరత్వం కూడా ఉంది. విదేశీ అవకాశాలు ఏడాదిపాటు రావు. ఆ తర్వాతే ప్రయత్నించాలి.
ధనుస్సు
గురువు శుక్రుడితో సంచారం చేయడంవల్ల ప్రయాణాలకు, బదిలీలకు అవకాశం లేని ఉద్యోగంలో చేరతారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడంకన్నా స్వదేశంలో చేయడమే మంచిది. దీనివల్ల వెంటనే ఫలితాలు అందుతాయి. ఉద్యోగంలో జీతభత్యాల కంటే అదనపు రాబడి ఎక్కువగా ఉంటుంది.
కుంభం
స్థిరమైన ఉద్యోగం స్వదేశంలోనే లభిస్తుంది. ఉద్యోగంవల్ల ధనలాభం ఉంది. ఈ రాశివారికి ధనయోగంతోపాటు భద్రత, స్థిరత్వం లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు అక్కడే స్థిరపడతారు. ఉద్యోగంలో ప్రాధాన్యత లభిస్తుంది.












Click it and Unblock the Notifications