వచ్చే నెలలో శుక్రుడి అస్తమయం.. ఈ రాశుల వారికి అన్నీ కష్టాలే
ఆనందం, ప్రేమ, సంపద, శృంగారానికి కారకుడు శుక్రుడు. శుక్రుడు ఉదయించడం లేదంటే అస్తమించడం జరిగినప్పుడల్లా ఈ రంగాలపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది. 12 రాశి చక్ర గుర్తులపై కూడా విస్త్రతంగా ఉంటుంది. వచ్చేనెల 4వ తేదీన శుక్రుడు అస్తమించబోతున్నారు. దీనివల్ల మూడు రాశులవారు జాగ్రత్తగా ఉండాలని, ఆర్థికంగా, వైవాహిక జీవితం పరంగా సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఆ రాశులు ఏవేంటనేది తెలుసుకుందాం.
సింహ రాశి : శుక్రుడి అస్తమయం సింహ రాశివారికి హానికరం. ఎందుకంటే రాశి నుండి లగ్న గృహంలో అస్తమించబోతున్నాడు. 3వ ఇంటికి, 10వ ఇంటికి అధిపతి. దీనివల్ల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. తోబుట్టువుల నుంచి గొడవలుంటాయి. పనిచేసేచోట సహచరుల నుంచి మద్దతు లభించదు. వైవాహిక జీవితానికి సంబంధించి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి : శుక్రుడి అస్తమయం వీరికి అనుకూలం కాదు. ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎవరికైతే అప్పుడుగా డబ్బులిస్తారో అవి రావు. మీరు మాట్లాడే మాటతీరు కూడా కఠినంగా మారుతుంది. దీనివల్ల ఇతర వ్యక్తులతో విభేదాలు ఎదురవుతాయి. తల్లి ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలి. 4 ఇంటికి, 11వ ఇంటికి శుక్రుడు అధిపతి. వ్యాపారస్తుల ఆదాయంలో కోత ఉంటుంది. వాహనంకానీ లేదంటే ఆస్తి లావాదేవీలుంటే వాటిని ఆపుకోవడం ఉత్తమం. కొత్త ఉద్యోగాన్ని చేయవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
మీన రాశి : శుక్రుడి అస్తమయం వీరికి హానికరం. రహస్య శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఛాతీ లేదంటే గొంతుకు సంబంధించిన వ్యాధి ఉండవచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపడం ఉత్తమం. ప్రమాదాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరికీ డబ్బులివ్వకుండా ఉండటం ఉత్తమం. లేదంటే డబ్బు ఇచ్చినవారు మునిగిపోయే ప్రమాదం ఉంది. శని సడేసతి కూడా జరుగుతుండటంవల్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications