ఏప్రిల్ 12 వరకు ఈ రాశులకు అంతులేని ధనయోగం

సూర్యుడు జాతక చక్రంలో శుభప్రదంగా ఉంటే ఆనందానికి, సంపదకు ఢోకా ఉండదు. కుజుడు అధిపతిగా ఉండే మీనరాశిలోకి సూర్యుడు రెండురోజుల క్రితమే ప్రవేశించాడు. ఏప్రిల్ 12వ తేదీవరకు సూర్యుడు మీనరాశిలోనే ఉంటాడు. అప్పటివరకు కొన్ని రాశులవారికి అంతా శుభమే జరుగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. రాబోయే 27 రోజులు వీరికి ఏవిధంగా కలిసిరానుందో తెలుసుకుందాం.

వృషభ రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉన్నాయి. కష్టపడి పనిచేసేవారికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగాలు చేసేవారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. వైవాహిక జీవితంలో అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.

these zodiac sign will get benefits due to Sun Transit 2024

కన్య రాశి
సూర్యుడి మీనరాశి సంచారం కన్యారాశివారిపై బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇతర దేశాలవారితో ఒప్పందాలను కుదుర్చుకుంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఇబ్బందులన్నీ సులువుగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.

కుంభ రాశి
ఆర్థికంగా వేధిస్తున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త కొత్త ప్రాజెక్టు చేపట్టడానికి, వాటిని విజయవంతం చేయడానికి ఇది మంచి సమయం.

వీరికి దుష్ప్రభావాలు
సింహ రాశి, వృశ్చిక రాశి వారితో పాటు మరికొన్ని రాశులవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు తీవ్ర నష్టాలున్నాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. తప్పకుండా కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+