నవంబరు నెలలో ఈ రాశుల పంట పండింది!
గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తుంటాడు. అలాగే నక్షత్ర సంచారం కూడా చేస్తాడు. ఈ నెల 19వ తేదీన అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. డిసెంబరు రెండోతేదీ వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల సూర్యుడి ప్రభావంతోపాటు శని ప్రభావం కూడా రాశులపై పడుతుంది. దీనికి కారణం అనురాధ నక్షత్రం శనిదేవుడి సొంత నక్షత్రం. ఈ పరిణామంతో ఏయే రాశులవారు ఏవిధంగా ప్రయోజనాలు పొందుతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం.
సింహరాశి
వీరికి అదృష్టం కలిసివస్తుంది. పిల్లలకు సంబంధించి చదవు విషయంలో వారు బాగా రాణిస్తారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తారు. కలిసివస్తాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నింటినీ ఈ సమయంలోనే పూర్తిచేయగులుగతారు. అంతేకాకుండా శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థక్షేత్రాల సందర్శనకు వెళతారు. కొన్ని రోజులు అక్కడే గడుపుతారు. గతంలో కంటే ఆర్థికంగా ఇప్పుడు బలపడతారు.

మిథున రాశి
ఉద్యోగస్థులకు వేతనాలు పెరుగుతాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. ఒకరకంగా ఈ సమయం ఈ రాశివారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు సద్దుమణుగుతాయి. కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవిస్తారు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.
వృశ్చిక రాశి
మంచి యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది మంచి సమయం. ఎప్పటినుంచో అనుకుంటున్న పనుల్లో కూడా మంచి ప్రయోజనాలు దక్కుతాయి. అంతేకాదు.. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. శుభవార్తలను అందుకుంటారు. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహాతో చేసే పనుల్లో ఆర్థిక విజయాలు కలుగుతాయి.












Click it and Unblock the Notifications