జూన్ 7 వరకు ఈ రాశులవారిదే అదృష్టం!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి గ్రహాలు నిర్దిష్ట వ్యవధిలోనే ప్రవేశిస్తాయి. ఆ సమయంలో భూమిని, దేశాన్ని, ప్రపంచాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం వ్యాపారాన్ని, తెలివితేటలను ఇచ్చే బుధుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. జూన్ 7వ తేదీ వరకు అక్కడే సంచరిస్తాడు. దీని ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ మూడు రాశులవారికి మాత్రం బాగా కలిసిరానుంది.
మేష రాశి:బుధుడి సంచారం వీరికి బాగుంటుంది. బుధుడు 3, 6వ గృహాలకు అధిపతిగా ఉంటూ లగ్నస్థానంలో ఉన్నాడు. దీనివల్ల వ్యక్తిత్వం మెరుగుపడటంతోపాటు శక్తి, ధైర్యం సమకూరతాయి. వివాహం కానివారికి వివాహ యోగం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతమవుతుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు రాశి:ఈ రాశివారికి శుభఫలితాలనిస్తుంది. బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడంవల్ల పిల్లలవైపు నుంచి ఎక్కువ శుభవార్తలు వింటారు. సంతానం కావాలని కోరుకునేవారు సంతానం పొందవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మికత, జ్యోతిష్య రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం చాలా కలిసివస్తుంది. ఏదైనా ఆస్తి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
మకర రాశి:బుధ గ్రహం జూన్ 7 వరకు 4వ ఇంట్లో సంచరిస్తుండటంవల్ల భౌతిక ఆనందాలను పొందుతారు. తండ్రి వైపు నుంచి ఆస్తులు పొందే అవకాశం ఉంది. వాహనంకానీ, భూమికానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. తల్లి మద్దతు సంపూర్ణంగా లభిస్తుంది. రియల్ ఎస్టేట్, ఆహారం, రెస్టారెంట్లు, హోటళ్లు, శని గ్రహానికి సంబంధించిన పని చేసే వారికి అద్భుతంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications