రేపు అరుదైన చతుర్గ్రాహి యోగం.. ఈ రాశులపై కుబేరుడి దయ
నవ గ్రహాల్లో రాహువు, కుజుడు, శుక్రుడు, బుధుడి సంచారాలను ప్రధానమైనవిగా జ్యోతిష్య పండితులు తెలియజేస్తుంటారు. చైత్ర పౌర్ణమిరోజు మీనరాశిలో నాలుగు గ్రహాల కలయికతో అరుదైన చాతుర్గ్రాహి యోగం ఏర్పడనుంది. కుజుడి ప్రవేశంతో ఇది జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశులవారికి ఆకస్మిక ధనలాభం కలగనుంది. వారికి ఏవిధంగా కలిసిరానుంది, వారికి కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
మిథున రాశి
అరుదైన చతుర్గ్రాహి యోగంవల్ల వీరికి అనుకోని ప్రయోజనాలు కలుగుతాయి. శుక్రుడు, కుజుడు, రాహువు, బుధుడి కలయికవల్ల ఉద్యోగం ఎదురుచూస్తున్నవారి కోరిక నెరవేరుతుంది. ఆర్థికంగా బలంగా ఉండాలంటే పెట్టుబడితోపాటు పొదుపుపై కూడా శ్రద్ధ ఉండాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో మంచి విజయాలున్నాయి. ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది.

కర్కాటక రాశి
పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇదే సమయంలో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయం. ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి తీసుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది. చేసే పనుల్లో స్పష్టత ఉండాలి. స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు ప్రణాళిక చేస్తారు.
వృషభ రాశి
వ్యాపారంలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. బాగా ఆలోచించిన తర్వాతే వ్యాపారస్తులు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. గతంలో మొదలై మధ్యలో నిలిచిపోయిన పనులను పూర్తిచేయడానికి ఇది అనువైన సమయం. పూర్తిస్థాయిలో అవగాహన కలిగిన తర్వాత కొత్త పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. పెట్టుబడి పెట్టే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అన్నిరోజులు మనకు అనువుగా ఉండవనే విషయాన్ని గుర్తుంచుకొని అడుగులు జాగ్రత్తగా వేయాలి.












Click it and Unblock the Notifications