కన్యారాశిలో కేతువు.. ఈ రాశులకు అఖండ ధనయోగం
ప్రస్తుతం కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు వృషభరాశిలోకి ప్రవేశించిన గురువు దృష్టి కేతువు మీద పడటంతో కొన్ని రాశులవారికి శుభయోగాలు కలుగుతాయి. వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ధనయోగం ఉంది.
వృషభం
పంచమ స్థానంలో కేతవును గురుడు వీక్షిస్తున్నాడు. దీనివల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. ప్రతిభా పాటవాలు పెరుగుతాయి. సొంత ఆలోచనలవల్ల వృత్తి, వ్యాపారాల్లో లాభాలున్నాయి. గుర్తింపు లభిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. పిల్లలు లేనివారికి సంతాన యోగం ఉంది.

కర్కాటకం
కేతువును గురుడు లాభస్థానం నుంచి వీక్షిస్తున్నాడు. దీనివల్ల ధనలాభం ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సాధిస్తారు. విదేశీ ప్రయాణాలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాణిస్తారు. విదేశాల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు.
కన్య
కేతువును గురుడు భాగ్య స్థానం నుంచి వీక్షిస్తున్నాడు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. లిక్కర్, వైద్యం, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి ఇది మంచి సమయం. విదేశాలకు వెళ్లేవారికి కలిసివస్తుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించాలి. ఆకస్మిక ధనలాభం ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి.
వృశ్చికం
కేతువును గురుడు సప్తమ స్థానం నుంచి వీక్షిస్తున్నాడు. దీనివల్ల నిరుపేదలు కూడా సంపన్నులయ్యే అవకాశం ఉంది. చిన్న ప్రయత్నం తలపెట్టినా అపార ధనలాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు మూడుపువ్వులు, ఆరుకాయలుగా సాగిపోతాయి. ఉద్యోగంలో వేతనాలు పెరుగుతాయి. హోదా పెరుగుతుంది. జీవితం సంతృప్తిగా గడుస్తుంది.
మకరం
కేతువును గురుడు పంచమ స్థానం నుంచి వీక్షిస్తున్నాడు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. సలహాలు, సూచనలతో బంధుమిత్రులు ప్రయోజనం పొందుతారు. సంతానం లేనివారికి సంతాన యోగం ఉంది. పిల్లల నుంచి శుభవార్తను వింటారు. ఇష్టమైన ప్రాంతాలను సందర్శించడంతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. తీర్థయాత్రలకు వెళతారు.
మీనం
ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. సంపన్న వ్యక్తితో పెళ్లి జరిగి జీవితం మారిపోతుంది. రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తితో ప్రేమలో పడతారు. వ్యాపార భాగస్వాములతో విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులు లాభాలబాట పడతారు. వృత్తి జీవితంలో ధనయోగాలు కలుగుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలున్నాయి.












Click it and Unblock the Notifications