కుజుడి దయతో ఈరోజు నుంచి ఈ రాశులకు అద్భుత ధనయోగం
అన్ని గ్రహాలకు అధిపతి అయిన అంగారకుడు ధైర్యానికి, బలానికి, భూమికి, శక్తికి బాధ్యత వహిస్తాడు. ఈనెల 12వ తేదీన కుజుడు మేష రాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశిలో అప్పటికే గురువు ఉన్నాడు. దీనివల్ల గురు, కుజ కలయిక ఏర్పడింది. జ్యోతిష్యం ప్రకారం ఈ పరిణామం కొన్ని రాశులవారికి అన్నివిధాలుగా కలిసివస్తుంది. కుజుడు వ్యక్తి జాతకంలో శుభస్థానంలో ఉంటే అదృష్టం తోడుగా ఉంటుంది. ఏయే రాశులవారికి ఏవిధంగా మేలు కలుగుతుంది, ఎన్ని ప్రయోజనాలు దక్కుతాయో తెలుసుకుందాం.
మేష రాశి
అంగారకుడు వృషభరాశిలోకి ప్రవేశించడంవల్ల ఆర్థికంగా లాభం కలగడంతోపాటు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. విద్యారంగానికి సంబంధించినవారు ఈ సమయంలో మంచి లాభాలను ఆర్జిస్తారు. అదృష్టం తోడుండటంవల్ల వీరికి ధనప్రాప్తి ఉంది. పెట్టుబడి పెట్టేవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది.

సింహ రాశి
ఉద్యోగంతోపాటు వ్యాపారంలో ఉన్నవారు మంచి వృద్ధిని నమోదు చేస్తారు. ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు సకాలంలో పూర్తిచేసి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. పరిస్థితులు క్లిష్టంగా అనిపించిన సమయంలో కుటుంబ సభ్యులందరి నుంచి సంపూర్ణమైన మద్దతు లభించి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.
కన్యా రాశి
ఉద్యోగస్తులకు వారు చేసే పనుల్లో విజయం లభిస్తుంది. అధికారుల నుంచి మంచి సహకారం అందడంతోపాటు వేతనం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెట్టుబడులు ఈ సమయంలో పెడితే భవిష్యత్తులో మీకు మంచి రాబడిని అందిస్తాయి. వినాయకుడి అనుగ్రహంతో ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి
విద్యకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది. ఆర్థికంగా లాభాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications