ఈరోజు నుంచి ఈ రాశులకు టైమ్ వచ్చింది.. యోగాన్ని అనుభవిస్తారు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులవారికి అశుభ ఫలితాలు కలుగుతుంటాయి. పవిత్రమైన శ్రావణ మాసం ఈనెల ఐదోతేదీ నుంచి ప్రారంభమైంది. ఈ మాసంలో అన్నిరోజులు పవిత్రమైనవే. లక్ష్మీదేవిని, పరమేశ్వరుడిని అధికంగా పూజిస్తుంటారు.
ఈరోజు నాగుల పంచమి వచ్చింది. అంతేకాకుండా శ్రావణ మాసంలో తొలి శుక్రవారం కావడంవల్ల అదృష్టం కూడా వరిస్తుంది. ఈరోజు ఎన్నో సంవత్సరాల తర్వాత సిద్ధి యోగం ఏర్పడింది. సిద్ధియోగం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లి విరవడంతోపాటు జీవితం మొత్తం ఆనందంగా కొనసాగుతుంది. శుక్ల పక్ష పంచమి రోజున కొన్ని సంవత్సరాల తర్వాత సిద్ధియోగం వచ్చింది. ఏ రాశులవారికి ఏవిధంగా కలిసిరానుందో తెలుసుకుందాం.

మిథున రాశి
విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారికి, వ్యాపారాలు చేస్తున్నవారికి వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. ఈ రాశుల జీవితం మొత్తం ఆనందమయంగా మారడంతోపాటు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత వెల్లివిరుస్తుంది. గతం నుంచి ఉన్న చిన్న చిన్న విభేదాలు సమసిపోతాయి. అదృష్టం తోడుండటంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి.
కన్యారాశి
జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వృత్తి జీవితంలో ఉన్నవారికి అన్నిరకాలుగా కలిసివస్తుంది. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడంతోపాటు పరమేశ్వరుడిని పూజించాలి. వారి దేవాలయాలను సందర్శించాలి. ఆధ్యాత్మికంగా ఆలోచనలుంటే అన్నివిధాలుగా సుఖశాంతులు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
తులారాశి
సిద్ధియోగం వీరికి బాగా కలిసివస్తుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. న్యాయపరమైన వివాదాల నుంచి విజయం వరిస్తుంది.
కుంభరాశి
ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. జీవితంలో లక్ష్యంగా నిర్దేశించుకున్నవాటిని కష్టపడి చేరుకుంటారు. ఈ క్రమంలోనే మానసిక ఒత్తిడి నుంచి బయటపడి విజయంవైపు పయనిస్తారు.
మీన రాశి
వ్యాపారస్తులకు వారి వారి వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరడంతోపాటు మంచి ఆరోగ్యం సమకూరుతుంది. ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. ప్రతి పనిలోను విజయం వరిస్తుంది.












Click it and Unblock the Notifications