రాహువుకు మీ రాశి ఇష్టమైతే మీ రొట్టె విరిగి నేతిలో పడినట్లే
జ్యోతిష్యం ప్రకారం రాహువు అంటే అన్నీ అశుభాలనే ప్రసాదిస్తాడని నమ్ముతారు. నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి సంచరించినప్పుడు కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయి. అలాగే రాహువు సంచారం చేసినప్పుడు చెడు ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. జాతకంలో రాహువు శుభస్థానంలో ఉంటే సంపదకు, సమాజంలో కీర్తి ప్రతిష్టలకు ఎటువంటి లోటు ఏర్పడదు. అశుభ స్థానంలో ఉంటే మాత్రం చెడు ఫలితాలు కలుగుతాయి. చెడు ఫలితాలకన్నా రాహువు కల్పించబోయే శుభ ఫలితాలవల్ల ఏయే రాశులవారికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం.
ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు
రాహువు అన్ని రాశులపై ఎప్పుడూ దుష్ప్రభావాలను కలిగించడానికి ఇష్టపడడదు. రాహువుకు ఇష్టమయ్యే రాశులు కొన్ని ఉన్నాయి. వారిని కష్టాల నుంచి బయటపడేయడంతోపాటు ఆర్థికంగా మంచి ప్రయోజనాలను కల్పిస్తాడు. ఎటువంటి ప్రమాదాలనైనా తట్టుకొని నిలబడగలిగే ఆత్మవిశ్వసాన్ని, మనో నిశ్చయాన్ని కల్పిస్తాడు. కోరుకున్న కోరికలను సులభంగా నెరవేరుస్తాడు.

సింహ రాశి
జీవితంలో ఎదురయ్యే తీవ్రమైన సమస్యల నుంచి బయటపడేందుకు జాతకుడికి, జాతకురాలికి పెద్ద సహాయం చేస్తాడు. మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి సులభంగా ఉపశమనం కలగడంతోపాటు అనారోగ్యం నుంచి విముక్తి కల్పిస్తాడు. ఈ సమయం వీరికి చాలా బాగుంటుంది. కోరుకున్న పనులన్నీ నెరవేరతాయి. పెద్దల నుంచి ఆస్తులు రావడంతోపాటు వాటిని దీర్ఘకాలిక రాబడి వచ్చేలా పెట్టుబడి పెడతారు. జీవితంలో ఆర్థిక స్థిరత్వం కల్పిస్తాడు.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి అంటే రాహువుకు చాలా ఇష్టం. వీరి జీవితంలో అనుకోకుండా విజయాలు పలకరిస్తాయి. అందుకు కారకుడు రాహువే. జీవితంలో వృద్ధి చెందడంతోపాటు పలు విజయాలను నమోదు చేస్తారు. వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసివస్తుంది. ఆనందకరమైన జీవితాన్ని ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగాలు చేసేవారికి వారు కోరుకున్న పనులన్నీ నెరవేరతాయి.












Click it and Unblock the Notifications