అనుకూల స్థితిలో గురువు.. ఆర్థికంగా బలోపేతమవుతారు
జాతకంలో గురువు, శుక్రుడు అనుకూలంగా ఉంటే ఆ రాశులవారికి దైవానుగ్రహం ఉన్నట్లు అర్థం. ఈ నెలలో కొన్ని రాశులవారి జీవితాలు మారిపోతున్నాయి. మానసికంగా ప్రశాంతత కలగడంతోపాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు చోటుచేసుకోనున్నాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.
మేషం
ఈ రాశివారు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పట్టుదలగా ఆటంకాలను అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. కెరీర్ లో కొత్త పంథాలో పయనిస్తారు. తమలో ఉన్న నైపుణ్యాలకు పదును పెడతారు. తమనుతాము అనేక విధాలుగా తీర్చిదిద్దుకుంటారు.

వృషభం
ఓర్పు, పట్టుదల ఎక్కువ. కొత్త లక్ష్యాలను ఏర్పరుచుకొని వాటిని సాధించుకుంటారు. ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు. ఉద్యోగంలో మంచి స్థాయికి చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని పట్టుదలగా ఆచరణలోకి తీసుకువచ్చి లబ్ధి పొందుతారు. ఈ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి సుఖ సంతోషాలు కలుగుతాయి. కొత్త నైపుణ్యాలను వంటబట్టించుకుంటారు.
కర్కాటకం
వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. దూరదృష్టితో వ్యవహరిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొత్త ప్రణాళికలను రూపొందించుకోవడంతోపాటు కెరీర్ కొత్త మలుపు తిరుగుతుంది.
కన్య
తెలివితేటలను బాగా ఉపయోగిస్తారు. ఆర్థికంగా పురోగతి ఉంది. కొత్త లక్ష్యాలను నిర్ధేశించుకొని వాటిని సాధించుకుంటారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచుకుంటారు. లాభదాయక పరిచయాలను పెంచుకుంటూ వెళతారు.
వృశ్చికం
జీవితంలో సరికొత్త మార్పులు జరుగుతాయి. ప్లానింగ్ వల్ల జీవితం మారిపోతుంది. కెరీర్ బాగుంటుంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. జీవితం అనేక మెట్లు పైకి తీసుకువెళుతుంది.
మీనం
వృత్తి వ్యాపారాలను విస్తరించుకుంటారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా పూర్తిచేస్తారు. కోరికలను, లక్ష్యాలను పట్టుదలతో, నైపుణ్యాలతో నెరవేర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి స్థాయికి చేరుకుంటారు. ఆర్థికంగా మంచి స్థాయి కలుగుతుంది.












Click it and Unblock the Notifications