డిసెంబర్ 7వరకు వీరికి చుక్కలే.. అడుగడుగునా కష్టాలే!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. సౌర వ్యవస్థలో నాల్గవ గ్రహంగా కుజుడిని చెప్తారు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని గ్రహాల అధిపతిగా భావిస్తారు. ప్రతీ 45 రోజులకు ఒకసారి కుజుడు రాశిని మారుస్తాడు. కుజుడు శక్తి, ధైర్యం, సోదరులు, వివాహం, సంతానం, భూమి, ప్రమాదాలకు కారకుడిగా చెప్తారు.
డిసెంబర్ 7వ తారీకు వరకు వీరు జాగ్రత్త
ప్రస్తుతం కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. డిసెంబర్ 7వ తారీకు వరకు కుజుడు వృశ్చిక రాశి లోనే ఉంటాడు. అయితే కుజుడు ఈ సమయంలో రాహువుతో కలిసి అంగారక యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. అంగారక యోగాన్ని జ్యోతిష్య శాస్త్రంలో విధ్వంసకరమైన యోగంగా చెబుతారు. అటువంటి అంగారక యోగం కారణంగా కష్టాలు పడే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మకర రాశి
మకర రాశి వారికి అంగారక యోగం కారణంగా ఇబ్బందులు కలుగుతాయి. వీరి ఆలోచన గణనీయంగా ప్రభావితం అవుతుంది. ఈ సమయంలో కోపం బాగా పెరుగుతుంది. ఇది పనిలో అంతరాయాన్ని కలిగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలను ఈ సమయంలో తీసుకునే ప్రమాదం ఉంది. ఈ సమయంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ప్రవర్తనలో కూడా ఊహించని చెడు మార్పులు వస్తాయి.
కుంభరాశి
కుంభరాశి వారికి అంగారక యోగం అనేక కష్టాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులు తోడబుట్టిన వారితో వాదనలకు దిగుతారు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదురవుతాయి. పనిలో జాగ్రత్తగా లేకపోతే అనవసరపు ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది. కెరీర్ ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. ఈ సమయంలో ప్రతి పనిని ఆలోచనతో చేయడం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి అంగారక యోగం ప్రతికూల ఫలితాలను తెస్తుంది వివిధ రంగాలలో పనిచేసే వారికి సమస్యలను పెంచుతుంది. పనికి అంతరాయం కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఇది కర్కాటక రాశి వారికి చెడు చేసే సమయం.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications