2026లొ అదృష్టవంతులయ్యే రాశులు వీరే
గ్రహాలు కాలానికి అనుగుణంగా సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటుంటాయి. మరో రెండు రోజుల్లో 2026 కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. దేవతల గురువైన బృహస్పతి జనవరి 26వ తేదీన చంద్రుడితో కలిసి గజకేసరి రాజయోగాన్ని ఏర్పాటు చేయనున్నాడు. జనవరి రెండో తేదీన చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే మిథున రాశిలో చంద్రుడు, బృహస్పతి కలుసుకుంటారు. ఈ యోగంతో ఏ రాశుల పంట పండుతోంది అనే వివరాలను తెలుసుకుందాం.
కర్కాటక రాశి
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వీరికి ఆస్తి కలిసివస్తుంది. అది ఎటువైపు నుంచైనా కావొచ్చు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనులు చేసి డబ్బులు సంపాదిస్తారు. కొత్త సంవత్సరంలో ఈ రాశులవారి జీవితం మారిపోనుంది.

తులా రాశి
గతంలో కంటే ఇప్పుడు ఈ రాశివారు ఆర్థికంగా బలోపేతమవుతారు. కెరీర్ పరంగా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కోర్టు సంబంధిత విషయాల నుంచి ఉపశమనం లభిస్తుంది. లక్ష్మీదేవి దయవల్ల సంపద పెరుగుతుంది. మీ శ్రేయస్సును అమ్మవారు చూసుకుంటారు. అదృష్టం గతంలోకంటే ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది.
వృషభ రాశి
పెట్టుబడులు పెట్టడంద్వారా మంచి లాభాలను అందుకుంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. రుణాల నుంచి బయటపడతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. గజకేసరి రాజయోగం ఈ రాశులను అదృష్టవంతులను చేస్తోంది. అలాగే కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.
మిథున రాశి
వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు. మీ పనితీరుతో అందరి ప్రశంసలు అందుకుంటారు. పెళ్లికానివారికి పెళ్లి యోగం కలుగుతుంది. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. ఎటువంటి కలహాలుండవు. రచన, మీడియా, కమ్యూనికేషన్స్, విద్య రంగాల్లో ఉన్నవారిని విజయం వరిస్తుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు.












Click it and Unblock the Notifications