వచ్చేనెల వరకు ఓపిక పడితే ఈ రాశులవారు కుబేరులే

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. ఏవైనా రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిస్తే ప్రత్యేక యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ ప్రభావంవల్ల కొన్ని రాశులవారికి ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. అనుకున్న లక్ష్యాలను కూడా చేరుకుంటారు. అక్టోబరు నెలలో శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అప్పటికే ఆ రాశిలో శని ఉండటంతో ఈ రెండు గ్రహాల కలయిక కొందరికి అదృష్టాన్ని తెస్తోంది. ఏ రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.

మకర రాశి
వీరికి అదృష్టం రెట్టింపు అవడంతోపాటు కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారుల నుంచి ప్రశంసలు లభించడంవల్ల ఉద్యోగపరంగా లాభం చేకూరుతుంది. ఈ సమయంలో వీరు ఎటువంటి పని తలపెట్టినా మంచి లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. వృత్తి జీవితంలో ఆదాయం రెట్టింపు అవుతుంది. పనిచేసే చోట మంచి పేరు తెచ్చుకుంటారు.

these zodiac signs vere lucky due to venus and saturn conjunction in aquarius

తుల రాశి
వీరికి కెరీర్ పరంగా ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో ఉన్నవారు సులభంగా విజయాలు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం అందుకుంటారు. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది.

వృషభ రాశి
వచ్చేనెలలో వీరు అనుకున్న పనులన్నీ నెరవేరతాయి. చాలాకాలం నుంచి పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి లాభాలున్నాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి కలుగుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+