ఈనెల 8 నుంచి ఈ రాశులకు మహర్దశ
బృహస్పతి , చంద్ర గ్రహాల కలయిక వల్ల అత్యంత అనుకూలమైన గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఏరకమైన దోషం లేనట్లైతే గజకేసరి తన పూర్తి బలాన్ని పొంది, స్పష్టమైన యోగాన్ని కల్పించి సంపద, కీర్తిని తెస్తుంది. గురుడు చంద్రుడి నుంచి కేంద్రాన్ని ఆక్రమించినప్పుడు ఇది ఏర్పడుతుంది.
ఈనెల 1న గురుడు మేషరాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశించాడు. ఇక్కడ ఏడాది సమయం ఉంటాడు. ఎనిమిదో తేదీన చంద్రుడు కూడా వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కలయికవల్ల అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడి రాశులవారికి అనేక ప్రయోజనాలు కల్పిస్తుంది. ఆ రాశుల వివరాలు తెలుసుకుందాం.

వృషభ రాశి
వృత్తిలో, ఉద్యోగంలో అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. వ్యాపారం చేసే విధానాన్ని మార్చుకోవడానికి ప్రయ్నతించాలి. దీనివల్ల భవిష్యత్తులో మంచి విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు.
సింహ రాశి
ఈ రాశివారికి గజకేసరి యోగం అనేక లాభాలను తీసుకురానుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. పిల్లలు మంచి ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా మంచి ఫలితాలనే అందిస్తాయి. రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారం గతంకంటే మెరుగ్గా ఉంటాయి.
కన్య రాశి
గజకేసరి యోగం జీవితాన్నే మార్చేస్తుంది. పనిలో ప్రాధాన్యతతోపాటు ప్రభావం కూడా పెరుగుతుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. త్వరలోనే ఊహించని విజయాన్ని సాధిస్తారు. ఆదాయానికి ఇబ్బంది లేదు. ఆరోగ్యం బాగుంటుంది.
ధనస్సు రాశి
నిరుద్యోగులకు సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం ఉల్లాసంగా గడుస్తుంది. పిల్లుల అభివృద్ధిలోకి వస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన ఒప్పందాలన్నీ విజయవంతంగా పూర్తిచేస్తారు. ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
మీనరాశి
ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో గౌరవానికి లోటుండదు. వృత్తి జీవితంలో ఎంతో బిజీ. దీనివల్ల ఆర్థికంగా కూడా ప్రయోజనాలున్నాయి. వ్యాపారాలు బాగుంటాయి. ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువ సమయం గడుపుతారు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.












Click it and Unblock the Notifications