కుజుడు - రాహువు యుతి... ఈ రాశులకు అపార ధనలాభం
కుజుడు, రాహువు పాపగ్రహాల కింద లెక్కగడుతుంది జ్యోతిష్య శాస్త్రం. ప్రస్తుతం ఇవి మీన రాశిలో ఉన్నాయి. కుజుడు వచ్చేనెల ఒకటో తేదీ వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు. ఈ రెండూ ధనానికి కారకుడైన గురువునకు సంబంధించిన మీనరాశిలో కలుస్తాయి. దీనివల్ల కొన్ని రాశులవారికి ధనయోగం పడుతోంది. చిన్న ప్రయత్నంతోనే కలిసి రావడం జరుగుతుంది. అదే ఈ రెండు గ్రహాల ప్రత్యేక. ఏ రాశులవారికి ఏవిధంగా కలిసిరానుందో తెలుసుకుందాం.
వృషభం
వీరికి ధనయోగమే కాకుండా అధికార యోగతోపాటు ఆరోగ్యం చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్, లిక్కర్, బ్రోకరేజ్, సేల్స్, మార్కెటింగ్ రంగాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేసినా సంపద కలిసివస్తుంది. లాభదాయకంగా పరిచయాలు ఏర్పడతాయి.

మిథునం
వృత్తి, ఉద్యోగాల్లో అపార ధనలాభం ఉంది. రాజకీయాలు, ఆస్పత్రులు, వైద్యం, రియల్ ఎస్టేట్, టూరిజం లాంటి రంగాల్లో ఉన్నవారికి సిరులు కురుస్తాయి. వైద్యులు, న్యాయవాద వృత్తిలో ఉన్నవారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. కొత్త ప్రయత్నాలు లాభాలను కలిగిస్తాయి.
తుల
లిక్కర్, రాజకీయాలు, రియల్ ఎస్టేట్, భూములు వంటి రంగాల్లో ఉన్నవారు ఏ కొత్త ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. గతంలో చేసిన ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. ప్రతి పని అనుకున్నరీతిలో జరుగుతుంది. సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
వృశ్చికం
వీరి ఆలోచనలు, నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. వైద్యులు, న్యాయవాద వృత్తిలో ఉన్నవారు తమ వ్యాపారాలను, వృత్తులను విస్తరిస్తారు. చేసే ప్రతి ప్రయత్నం కూడా వీరికి ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది. ఆస్పత్రులు, ఆరోగ్యం, వడ్డీ వ్యాపారం, మార్కెటింగ్ వంటి రంగాల్లో ఉన్నవారికి సంపన్న జీవితం దొరుకుతుంది.
మకరం
చొరవ, ధైర్యం పెరుగుతుంది. చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయాన్నిస్తుంది. ఉద్యోగంతోపాటు వివాహ ప్రయత్నాల్లో అనుకున్నదానికంటే మంచి ఫలితాలనే అదుకుంటారు. ప్రయాణాలవల్ల లాభాలు పొందుతారు. టూరిజంలో ఉన్నవారికి బాగుంది. భూమికి సంబంధించిన ఆస్తి కలిసివస్తుంది.
కుంభం
గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి. వైద్యులు, న్యాయవాద వృత్తిలో ఉన్నవారు క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఏ ప్రయత్నమైనా లాభాలతోనే ఉంటుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుంది. టూరిజం, మార్కెటింగ్ రంగాలవారు ఆర్థికంగా స్థిరపడటానికి ఇది అనువైన సమయం.












Click it and Unblock the Notifications