12 ఏళ్ల తర్వాత అంగారకుడు, గురుడు.. ఈ రాశులవారికి మహర్దశ
దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురుడు వృషభరాశిలోకి మారాడు. జూన్ లో అంగారకుడు వృషభరాశిని బదిలీ చేస్తారు. వచ్చే నెలలో ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి. 12 ఏళ్ల తర్వాత ఈ కూటమి ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశిచక్రాలకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. సంపద పెరగడంతోపాటు అన్నివిధాలుగా అదృష్టం తోడుంటుంది. ఏయే రాశులవారు లాభపడనున్నారో వివరాలు తెలుసుకుందాం.
వృషభం
ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి శుభవార్త ఉంది. వైవాహిక జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలుపెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగపడుతుంది. వ్యాపారానికి సంబంధించినవాటిల్లో డబ్బు సంపాదన ఎక్కువగా ఉంటుంది.

సింహం
పనిచేసే చోట ప్రత్యేకమైన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మంచి ఆదాయం ఉంది. సంపద పెరిగే అవకాశం ఉంది. పనిచేస్తున్న రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తండ్రితో అనుబంధం బలపడుతుంది. పూర్వీకుల నుంచి ఆస్తి కలిసివస్తుంది. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు.
కర్కాటకం
ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. దీనికికారణం ఈ రాశి నుంచి సంపద స్థానంలో గురుడు, అంగారకుడి కలయిక ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. డబ్బును ఆదా చేయడంద్వారా ప్రయోజనం పొందుతారు. వ్యాపారం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఈ కాలంలో మీరు పెట్టుబడులు పెట్టడంతోపాటు ప్రేమ సంబంధాలు కూడా ఓకే అనిపించుకుంటారు. కుటుంబంలోని సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. బిడ్డకు సంబంధించి శుభవార్తలను వింటారు.












Click it and Unblock the Notifications