రేవతి నక్షత్రంలోకి కుజుడు.. ఈ రాశులపై కుబేరుడి అనుగ్రహం

జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు రాశి చక్రాన్ని మాత్రమే కాకుండా నక్షత్రాన్ని కూడా మార్చుకుంటాయి. 12 రాశులపై ఈ ప్రభావం ఉంటుంది. కుజుడు ఈనెల 15న తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు. శక్తికి, శౌర్యానికి, ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి అంగారకుడు కారకుడు. జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నీ అంగారకుడి నక్షత్ర సంచారంవల్ల ప్రభావితమవుతాయి. దీనివల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

రేవతి నక్షత్ర ప్రభావం
ఈ నక్షత్రంలో పుట్టినవారు తెలివిగా ఉంటారు. విద్యలో రాణించడంతోపాటు డబ్బును ఖర్చుపెట్టే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. మెదడు చురుగ్గా ఉంటుంది. ఇతరులతో వీరు వ్యవహరించే విధానంవల్ల విజయాలు చేకూరతాయి. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను సునాయాసంగా దాటతారు.

these zodiac signs very lucky due to mars nakshatra transit

మిథున రాశి
వీరికి మంచి రోజులు రాబోతున్నాయి. తోబుట్టువుల మద్దతుతో ధనలాభం ఉంది. అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త ఉద్యోగం లభిస్తుంది. పాత పెట్టుబడుల నుంచి ఆదాయం వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది.

సింహ రాశి
పూర్వీకుల ఆస్తి నుంచి సంపద పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పెళ్లికానివారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఆకస్మిక ధనలాభానికి కొత్త మార్గాలు లభిస్తాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు క్రమేపీ పూర్తిచేయగలుగుతారు.

వృశ్చిక రాశి
రియల్ ఎస్టేట్ లేదంటే స్టాక్ మార్కెట్ లో తెలివిగా పెట్టుబడి పెట్టాలి. దీని నుంచి మంచి రాబడి వస్తుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి.

ధనుస్సు రాశి
భాగస్వామ్యంతో చేసే వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం తగ్గిపోతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉన్నాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. వాహనం లేదంటే భూమిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కుంభ రాశి
అదృష్టం తోడుంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. అప్పుల నుంచి బయటపడతారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+