జూన్ 6 నుంచి ఈ రాశులు పట్టుకుందల్లా బంగారమే!
జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది జూన్ నెలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలోనే శని జయంతిని జరుపుకుంటారు. అర్దాష్టమ శని, ఏలినాటి శని, శని సడేసతితో బాధపడుతున్నవారు ఈ సమయంలో శనిని పూజించాలి. దీనివల్ల అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. న్యాయదేవత అయిన శనిని ఆయన జయంతి రోజు పూజించడంవల్ల అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది.
మీనం, మకర, కుంభ
మీన రాశివారికి, మకర రాశివారికి, కుంభరాశివారికి ఏలినాటి శని నడుస్తోంది. వీరు శని జయంతిరోజు స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. కర్కాటక రాశి, వృషభరాశివారికి శని గ్రహం అశుభ స్థానంలో ఉంది. శనిజయంతిరోజు వీరు స్వామిని పూజిస్తే అద్భుతమైన అవకాశాలు వీరి సొంతమవుతాయి. జీవితం మీద విరక్తి పుట్టినవారికి, అర్దాష్టమ శని, ఏలినాటి వారు రావిచెట్టును పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరతాయి.

దీపం వెలిగించాలి
ఈ రాశులవారు శని జయంతిరోజు రావిచెట్టును పూజించడంతోపాటు చెట్టు కింద దీపాన్ని వెలిగించాలి. శనికి ఇష్టమైన వస్తువులను దానం చేయడంవల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో అమావాస్య రోజు శని జయంతిని జరుపుకుంటారు. అది ఈ ఏడాది జూన్ ఆరోతేదీన వచ్చింది. శనికి ఇష్టమైన నల్ల నువ్వులు, నల్ల వస్తువులను దానం చేయడంవల్ల ఏలినాటి శని నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.
శని నుంచి ఉపశమనం
శని జయంతిని ప్రతి ఏడాది రెండు సార్లు జరుపుకుంటారు. వైశాఖ మాసంలోని అమావాస్య తిథి మే 7వ తేదీన జరుపుకున్నారు. మరొకటి వచ్చేనెల ఆరోతేదీన రాబోతోంది. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే స్నానం చేసి శనీశ్వరుడికి పూజలు చేయాలి. జీవితంలో సుఖ సంతోషాలు లభించడంతోపాటు శని మహాదశ నుంచి ఉపశమనం లభిస్తుంది.












Click it and Unblock the Notifications