శష రాజ్యయోగంతో అడుగడునా ఈ రాశులకు విజయాలే
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచరించే క్రమంలో వివిధ యోగాలు ఏర్పడుతుంటాయి. నవగ్రహాల్లో ప్రత్యేకమైన స్థానం పొందిన శనిదేవుడు శ్రావణ మాసంలో శష రాజ్యయోగాన్ని ఇస్తున్నాడు. ఆయన తన సొంత రాశి మకరం, కుంభరాశుల్లో ఉన్నప్పుడు రాశులవారికి మంచి ఫలితాలను అందజేస్తాడు. శనిదేవుడు తులా రాశిలో ఉన్నప్పుడు ఈ శష రాజ్యయోగం ఏర్పడనుంది. జీవితంలో ఎదురయ్యే అనేక దారుణ పరిణామాల నుంచి ఈ యోగం కాపాడుతుంది. కెరీర్ లో మంచి విజయాలు నమోదు చేయడానికి అవకాశం కల్పిస్తుంది.
మిథునరాశి
కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. సంపద పెరుగుతుంది. వ్యాపారస్తులకు బాగుంటుంది. పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని విస్తరిస్తారు. వృత్తిలో ఉన్న ఆటంకాలను అధిగమించడంతోపాటు ఆధ్యాత్మిక విషయాలపై మనసు మొగ్గుచూపుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మకర రాశి
ఆర్థిక పరిస్థితి పటిష్టంగా మారుతుంది. వ్యాపారానికి సంబంధించి, ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. జీవితంలో ఇంతవరకు ఎదురుకాని సానుకూల పరిణామాలు మీకు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు బాగుంటుంది. న్యాయపరమైన విషయాల్లో విజయాన్ని దక్కించుకుంటారు.
కుంభ రాశి
శనిదేవుడికి కుంభరాశి సొంత రాశి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతోపాటు ఆరోగ్యం బాగుపడుతుంది. ఉన్న సంపదలోనే పెరుగుదల చోటుచేసుకుంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తి కలిసివస్తుంది. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి.
మీన రాశి
కుటుంబ జీవనం సంతోషంగా గడుస్తుంది. కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రతిరంగంలోను గొప్ప విజయాన్ని సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది.












Click it and Unblock the Notifications