శని నక్షత్ర సంచారం.. ఈ రాశులవారు పట్టుకుందల్లా బంగారమే

జ్యోతిష్యం ప్రకారం జాతకంలో గ్రహాలు శుభస్థానంలో ఉంటే జీవితం ఆనందంగా సాగుతుంది. అశుభ స్థానంలో ఉంటే ఆర్థిక నష్టాలతోపాటు జీవితం చిన్నాభిన్నమవుతుంది. శనిదేవుడి సంచారంవల్ల కూడా అప్పుడప్పుడు శుభ, అశుభ ఫలితాలు ఎదురవుతుంటాయి. ఈనెల 12వ తేదీన శని పూర్వాభాద్ర నక్షత్రంలోని రెండో స్థానంలోకి సంచారం చేయబోతున్నాడు. ఆగస్టు 18 వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. విపరీతమైన ధన లాభంతోపాటు అదృష్టం తోడుండి పనులన్నీ పూర్తిచేయగలుగుతారు. ప్రయోజనాలు పొందబోయే రాశుల వివరాలు తెలుసుకుందాం.

కన్య రాశి
న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు డబ్బులకు సంబంధించిన శుభవార్తలను వింటారు. గతంలో పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను అందిస్తాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నప్పటికీ వాటివల్ల ఇబ్బంది ఉండదు.

these zodiac signs very lucky due to shani transit 2024

వృశ్చిక రాశి
కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లోనే ఉండిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. శని ప్రభావంతో శుభవార్తలు వింటారు. ఎప్పటినుంచో వస్తున్న కొన్ని సమస్యలకు ఈ సమయంలో పరిష్కారం దొరుకుతుంది.

కుంభరాశి
వీరికి శనిదేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. దీనివల్ల ఏ పనినైనా సులభంగా చేయగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. డబ్బు పరంగా ఎటువంటి లోటు ఉండదు. వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సమాజ సేవ చేసేవారు ఈ సమయంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+