జూన్ 30వ తేదీ నుంచి ఈ రాశులకు మహర్దశ
జూన్ 30వ తేదీ నుంచి శని తిరోగమనదిశలో ఉంటుంది. ఈ ప్రభావం అన్ని రాశులవారిపై ఉన్నప్పటికీ కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది. శని సడేసతి సమస్యలతో బాధపడేవారిపై మాత్రం అధిక ప్రభావం ఉంటుంది. శనిదేవుడి సంచారానికి ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. సంచారంవల్ల కొన్ని శుభ, అశుభ ప్రభావాలు ఏర్పడతాయి. ఏ రాశులవారికి ఎలా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మేష రాశి
ఈరాశి 11వ స్థానంలో తిరోగమనం జరగబోతోంది. వృత్తి జీవితంపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీనివల్ల ఆశించిన ఫలితాలు పొందుతారు. ఎటువంటి పనులు చేసినా కలిసివస్తుంది. డబ్బులు వస్తాయి. ఆర్థికంగా మంచి స్థాయి రావడంతోపాటు ధన లాభాలను పొందుతారు. వైవాహిక జీవితంలో ఉన్నవారికి చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నప్పటికీ ఈ సమయంలో పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని భార్యాభర్తలు చవిచూస్తారు.

మిథున రాశి
అదృష్టం రెట్టింపు అవుతుంది. ఏ పని తలపెట్టినా లాభాలు పొందుతారు. పనులు ఆలస్యమవుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి లేదంటే స్నేహితులతో కలిసి తీర్థయాత్రకు లేదంటే విహారయాత్రలకు వెళ్లడానికి అవకాశం ఉంది.
సింహ రాశి
వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి లాభాలున్నాయి. గతంలో మొదలై నిలిచిపోయి పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రయాణం కూడా ఆర్థికంగా కలిసివస్తుంది. కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.












Click it and Unblock the Notifications