బుధుడు, శుక్రుడి కలయికతో ఈ రాశులకు ధనలక్ష్మీ యోగం
ఈనెల 14వ తేదీ నుంచి బుధుడు, శుక్రుడు మేషరాశిలో సంచారం చేస్తారు. దీనివల్ల ధనలక్ష్మీ యోగం ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు శుభ గ్రహాలే కావడంతో వ్యక్తుల ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి. ప్రధానంగా మేషరాశి, కర్కాటక రాశి, తులారాశి, మకర రాశి, మిథునరాశి, మీన రాశులవారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
మేషం
వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాణిస్తారు. క్షణం తీరిక లేకుండా ఉంటారు. మంచి గుర్తింపు రావడంతోపాటు రాబడి కూడా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు సైతం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. మనసులోని కోరికలన్నీ నెరవేరడంతోపాటు ఇబ్బడి ముబ్బడిగా ఆర్థిక లాభాలుంటాయి. సంపద పెరుగుతుంది.

మిథునం
ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. అదనపు రాబడి పెరుగుతుంది. బ్యాంక్ లో మంచి బ్యాలెన్స్ ను నిర్వహిస్తారు. సంపద పెరుగుతుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి రావడం, సంతాన యోగం కలుగుతాయి. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు పరిచయం అవుతారు. నిరుద్యోగులు తమ ప్రతిభకు తగ్గ ఉద్యోగంలో చేరతారు. అనారోగ్యం తగ్గిపోతుంది.
కర్కాటకం
వృత్తి, ఉద్యోగాల పరంగా ఏ ప్రయత్నం చేసినా విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలతోపాటు వ్యాపారాల్లో కూడా శుభ పరిణామాలుంటాయి. కోరుకున్న ఉద్యోగంలో నిరుద్యోగులు స్థిరపడతారు. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. సామాజికంగా పలుకుబడి పెరగడంతోపాటు గౌరవ మర్యాదలు లభిస్తాయి. మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయి.
తుల
సమాజంలో హోదా పెరుగుతుంది. సంపన్న కుటుంబంలో పెళ్లి కుదురుతుంది. మాములు సంస్థలో ఉద్యోగం చేసేవారు కార్పొరేట్ సంస్థలోకి వెళతారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.
మకరం
సుఖ సంతోషాలతో గడుపుతారు. సొంత ఇల్లు ఏర్పడటంతోపాటు వాహన యోగం ఉంది. అమ్మ వల్ల ధనలాభం ఉంది. ప్రయాణాలవల్ల ప్రయోజనం పొందుతారు. కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగంలో మీ ప్రభావం పెరుగుతుంది.
మీనం
ఆకస్మిక ధనలాభం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మంచి స్నేహాలు కుదురుతాయి. ఇవి లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలోని పరిస్థితులన్నీ చక్కబడతాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. స్త్రీ వల్ల ధనలాభం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.












Click it and Unblock the Notifications