వృషభరాశిలోకి కుజుడు.. ఈ రాశులకు సుడి తిరిగింది
నాయకత్వ లక్షణాలకు, యుద్ధానికి అధిపతి అయిన కుజుడు వచ్చేనెల 12వ తేదీన వృషభ రాశిని బదిలీ చేయబోతున్నాడు. గురుడు, కుజుడి కలయిక కూడా ఈ రాశిలో జరుగుతోంది. వృషభరాశిలో 46 రోజులు కుజుడు ఉంటాడు. తర్వాత ఆగస్టు 26వ తేదీన మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఆరు రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలు దక్కనున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
మేషం
మీన రాశి నుంచి రెండో స్థానంలో కుదులుతున్నాడు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. తీర్థయాత్రలకు వెళతారు. సంతోషంగా ఉండేందుకు డబ్బును ఎంతైనా ఖర్చుచేయడానికి సిద్ధపడతారు. జీవిత భాగస్వామితోపాటు కుటుంబంలోని ఇతర సభ్యులతో కూడా సంబంధాలు బాగుంటాయి.

వృషభం
వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయి. అత్త మామల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వ్యాపారాన్ని విస్తరించేందుకు కొత్త వ్యూహాలను రచిస్తారు. డబ్బు ఎక్కడైనా నిలిచిపోతే వాటిని తిరిగి పొందుతారు.
సింహం
ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆస్తిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. అదృష్టం తోడుంటుంది. మతపరమైన కార్యక్రమాలపట్ల అనురక్తి కలుగుతుంది.
కన్య
విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో గెలుపొందుతారు. వివిధ మార్గాలద్వారా సంపదను పొందుతారు. సంపదను కూడబెడతారు. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కుటుంబంలో గొడవలు సమసిపోతాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. నిలిచిపోయిన డబ్బును పొందుతారు.
తుల
డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు తెరుచుకుంటారు. ఆర్థికంగా పరిస్థితి మెరుగపడుతుంది. వేతనాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మంచి ప్రయోజనాలున్నాయి. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.
ధనుస్సు
మంచి స్నేహితులను సంపాదించుకుంటారు. సోదర, సోదరీమణుల నుంచి పూర్తి మద్దతు లభించింది. ధైర్యం పెరుగుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభంతోపాటు పురోగతి ఉంటుంది. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు.












Click it and Unblock the Notifications