ఒకే రాశిలో రెండు గ్రహాలవల్ల వీరికి అన్నీ ఇబ్బందులే
కొన్ని గ్రహాలు ఒకే నక్షత్రంలో లేదంటే ఒకే రాశిలో కాలానుగుణంగా కలుస్తుంటాయి. ఇలా కలవడాన్ని జ్యోతిష్యంలో సంయోగం అంటారు. గ్రహాలు సంయోగం చేస్తే 12 రాశులపై ప్రభావం పడుతుంది. గ్రహాలకు పాలకుడిగా భావించే కుజుడు వచ్చే నెలలో వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే బృహస్పతి కూడా అదే రాశిలో ఉండటంవల్ల రెండు గ్రహాల సంయోగం జరుగుతుంది. కుజుడు ప్రస్తుతం అశుభ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల వచ్చేనెల 12వ తేదీ లోపు ఏ రాశులవారికి అశుభ పరిణామాలు ఎదురు కాబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
తులారాశి
కష్టపడి పనిచేయడంవల్ల లాభాలున్నప్పటికీ నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి దారితీస్తుంది. వ్యాపారస్తులు నష్టపోతారు. ఓపికగా ఉండి పని చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. ప్రయాణాలు చేయడం కూడా మంచిది కాదు. కుటుంబ సభ్యులతో ఇబ్బందులు వస్తాయి.

వృశ్చిక రాశి
అనేకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ పని తలపెట్టినా ఇబ్బంది తప్పదు. కుటుంబ సభ్యులతో గొడవలు వస్తాయి. ఆర్థికంగా సమస్యలు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. సమాజంలో పేరు దెబ్బతింటుంది. ఉద్యోగస్తులు ఓపికగా ఉండాలి. పనిచేసేచోట ఎంత ఓర్పుగా, మౌనంగా ఉంటే అంత మంచిది. లేదంటే ఉపాధి దెబ్బతినే అవకాశాలు ఎదురవుతాయి. అదనపు ఖర్చులు పెరుగుతాయి. పిల్లల నుంచి కూడా సమస్యలు వస్తాయి.
కన్యా రాశి
వివిధ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కష్టపడితేనే ఫలితాలు దక్కుతాయి. అధిక ఖర్చులు ఉంటాయి. దీనివల్ల ఆర్థికంగా నస్టపోతారు. వైవాహిక జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. ప్రధానంగా ఆందోళన పెరగడంతో అనారోగ్యం కలుగుతుంది. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అప్పులు తీసుకున్నవారికి గడ్డు కాలం ఎదురవుతుంది. సమాజంలో ఇప్పటివరకు ఉన్న పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి. తప్పకుండా ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక్కట్లు తప్పవు.












Click it and Unblock the Notifications