కుజ దోషంతో ఈ రాశులకు మహాయోగాలు పడుతున్నాయి

కుజుడు తన సొంత రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. వచ్చేనెల 12వ తేదీ వరకు ఇక్కడే ఉంటాడు. తన సొంత రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కుజదోషం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. కొన్ని రాశులకు దన సంపాదన పెరగడంతోపాటు న్యాయపరమైన వివాదాల్లో విజయం సాధిస్తారని, సమాజంలో హోదా పెరుగుతుందని చెబుతున్నారు. ఇలా లాభపడే రాశుల్లో మేషం, వృషభం, కన్య, తుల, మకరం, మీన రాశులున్నాయి.

మేషం
మేష రాశిలో కుజుడి సంచారంవల్ల జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి. కాకపోతే అవన్నీ టీకప్పులో తుఫానుగా సమసిపోతాయి. ఉద్యోగస్తులకు అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరిగి వీటిని బాగా నడిపిస్తారు. విదేశాలకు వెళ్లడానికి అవకాశం లభిస్తుంది. ఏ వ్యవహారంలోనైనా పనిని పూర్తిచేయగలుగుతారు. సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

These zodiac signs will get maha yoga due to kuja dosha 2024 july

వృషభం
జీవిత భాగస్వామితో సుఖ సంతోషాలు తగ్గుతాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలుండటం, బదిలీ కావడం వంటి కారణాలతో ఇద్దరి మధ్య ఎడబాటు ఏర్పడుతుంది. కలిసివుంటే మాట పట్టింపు తలెత్తుతుంది. వ్యయం బాగా పెరుగుతుంది. విలాసాల కోసం ఎక్కువగా ఖర్చుపెడతారు.

కన్య
బంధువులవల్ల సమస్యలు వస్తాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు రేకెత్తుతుంటాయి. ఇద్దరిలో ఒకరు అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. దాంపత్య సౌఖ్యం తగ్గుతుంది. విహార యాత్రలకు వెళతారు. ఆస్తి వివాదం సమసిపోవడంతోపాటు ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది.

తుల
తొందరపాటుతనంతో వ్యవహరించి కష్టాలు కొనితెచ్చుకుంటారు. వ్యసనాలవల్ల ఇక్కట్లు తప్పవు. ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభించడంతోపాటు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.

మకరం
కుజ దోషం ఏర్పడింది. ఓర్పుతో వ్యవహరించాలి. దంపతుల మధ్య కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. ఇద్దరి మధ్య అపార్థాలు తలెత్తుతాయి. గ‌‌‌ృహ, వాహన సౌకర్యాలు కలుగుతాయి. ఆస్తి విలువ పెరగడంతోపాటు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది.

మీనం
జీవిత భాగస్వామితో ఆచితూచి మాట్లాడాలి. కుటుంబ సమస్యలు పెద్దవి అవుతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. సౌకర్యాలు మెరుగుపడతాయి. ఏ పని తలపెట్టినా ఆదాయం సమకూరుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+