ఈనెల 10న బుధాదిత్య యోగం.. ఈ రాశులపై కనక వర్షం

ఈనెల 10వ తేదీన గ్రహాలకు రాకుమారుడైన బుధుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. అప్పటికే ఆ రాశిలో సూర్యుడు ఉండటంవల్ల ఈ రెండు గ్రహాల కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి ధనలాభం కలగడంతోపాటు అదృష్టం రెట్టింపు అవుతుంది. జాతకంలో ఈ యోగం శుభస్థానంలో ఉన్నవారికి వృత్తిపరమైన జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. న్యాయపరమైన విషయాలకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. స్నేహితుల నుంచి ధనలాభం ఉంది.

మేష రాశి
వృత్తి జీవితంలోని సమస్యల నుంచి సులభంగా పరిష్కారం లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. వ్యాపారాల్లో ఉన్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్తగా ఆదాయ వనరులు లభిస్తాయి. వైవాహిక జీవితంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు తొలగిపోతాయి.

these zodiac signs will get more benefits due to Budhaditya Rajyog in Aries 2024

సింహ రాశి
ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంది. కెరీర్ కు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగాలు చేసేవారికి అనేక ప్రయోజనాలున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో సులువుగా విజయం సాధిస్తారు.

తుల రాశి
ఈ సమయంలో వీరికి విపరీతమైన ధనలాభం ఉంది. వస్తు సౌఖ్యం కూడా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కెరీర్ కు సంబంధించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను పూర్తిచేయడానికి ఇది మంచి సమయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+