మేషరాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులు కుబేరులే
గ్రహాలు కాలానుగుణంగా సంచారం చేస్తుంటాయి. రాశిని మార్చడం లేదంటే సంచారం చేయడం లేదంటే ఇతర గ్రహాలతో సంయోగం జరపడంవల్ల శుభ ఫలితాలతోపాటు అశుభకరమైన ఫలితాలు కూడా ఎదురవుతున్నాయి. వచ్చే నెలలో బుధుడు, శుక్రుడు మేషరాశిలో కలవబోతున్నారు. దీనివల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. దీనివల్ల ప్రధానంగా మూడు రాశులవారి సంపద వృద్ధి చెందడంతోపాటు ఆర్థికంగా అనేక ప్రయోజనాలను కల్పించనుంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశిలోనే శుక్రుడు, బుధుడు కలవనున్నారు. పనిచేస్తున్నచోట మంచి స్థాయికి చేరుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యేవారు విజయం సాధించడంతోపాటు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న కోరికలను నెరవేర్చుకుంటారు. వేతనం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను పూర్తిచేయగలుగుతారు.

మిథునరాశి
పెట్టే పెట్టుబడుల నుంచి మంచి లాభాలుంటాయి. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకుంటారు. చేసే ప్రతి పనిలో జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
కర్కాటక రాశి
శుక్రుడు, బుధుడు కలయికతో వ్యాపారస్తులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారి కోరిక నెరవేరుతుంది. దాంపత్య జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కష్టాలన్నీ తొలగిపోవడంతోపాటు ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది. అదృష్టం తోడుండటంవల్ల అప్పుల ఊబి నుంచి సులువుగా బయటపడతారు.












Click it and Unblock the Notifications