అక్షయ తృతీయ రోజే లక్ష్మీనారాయణ యోగం.. వీరికి అఖండ ధనయోగం

అక్షయ తృతీయ అనేది మంచి తిథి. ఆరోజు ఏది కొనుగోలు చేసినా అక్షయ సంపదలను ఇస్తుంది. అందుకే ఆరోజు చాలామంది కొంచెమైనా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది మే 10వ తేదీన అక్షయ తృతీయ రాబోతోంది. ఆరోజు అత్యంత అరుదుగా సంభవించే లక్ష్మీనారాయణ యోగం కూడా సంభవించనుంది. ఇటువంటి శుభ ఘడియలను జీవితంలో అసలు వదులుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. విష్ణువుకు అత్యంత ఇష్టమైనవాటిల్లో వైశాఖ మాసం ఒకటి. ఆరోజు ఏ పూజ చేసినా, వ్రతాలు చేసినా అక్షయమైన ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీనారాయణ యోగంవల్ల ప్రధానంగా మూడు రాశులవారి జీవితాల్లో లక్ష్మీదేవి అనుగ్రహం వర్షించనుంది.

మిథునం
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభ ఘడియలు వచ్చినట్లు చెప్పాలి. అఖండ ధనయోగంతోపాటు నచ్చిన అమ్మాయితో వివాహం కుదురుతుంది. ఏ కార్యం తలపెట్టినా అది ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవడంతోపాటు న్యాయపరమైన కేసుల్లో కూడా విజయం సాధిస్తారు. జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది.

these zodiac signs will get more money due to Laxminaraya yoga in Akshaya tritiya 2024

కర్కాటకం
జీవితంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాలున్నాయి. తండ్రివైపు నుంచి ఆస్తులు వస్తాయి. విదేశాలకు వెళ్లే యోగం కనపడుతోంది. సోదరులతో విభేదాలు, బంధువులతో ఏర్పడిన గొడవలు సమసిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

కన్యా
మంచి అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఇప్పటివరకు కావు అని వదిలేసిన పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. లాటరీలు తగిలే అవకాశం ఉంది. మంచి ఇంటిని కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ధనలాభం ఉంది. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి.

అక్షయ తృతీయ పూజావిధానం
అమ్మవారిని కుంకుమతో అభిషేకం చేయాలి. కమలాలతో అర్చించడంతోపాటు ఎరుపు రంగు పూలు, పాయసం, చక్కెరపొంగలి లాంటివి నైవేద్యంగా సమర్పించాలి. లలితా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే జీవితంలో అంతా మంచే జరుగుతుంది. ఆరోజు కొంచెమైనా బంగారం కొనుగోలు చేయాలి. కుండలో నీళ్లను నింపి పండితులకు దానంగా ఇవ్వాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+