ఏడాది పొడవునా శశ రాజయోగం.. ఈ రాశులకు డబ్బే డబ్బు
శని దేవుడు మూల త్రికోణ రాశిలో ఉండటంతో శశ రాజయోగం సంభవించింది. దీని ప్రభావం ఏడాది మొత్తం ఉంటుంది. ధర్మం, న్యాయం, కర్మల అనుసారంగా ప్రతిఫలం ఇస్తాడు. శనికి ఉచ్ఛమైన రాశి అయిన తుల లేదంటే దాని సొంత రాశులైన మకరం, కుంభరాశిలో ఉన్నప్పుడు ఈ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావంతో అధికారం, శక్తి లభిస్తుంది. అందుకు పట్టుదల, కృషి, క్రమశిక్షణ ఉండాలి. సవాళ్లు ఎదురైనప్పటికీ తట్టుకోవాలి. దీర్ఘాయువు, నాయకత్వం, స్థిరత్వం, అధికార స్థానాల్లో గౌరవం దక్కుతుంది. శని దేవుడి ఆశీస్సులు పొందే రాశుల వివరాలు తెలుసుకుందాం.
కుంభ రాశి
ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఏ రంగంలోనైనా డబ్బులు సంపాదిస్తారు. వ్యాపారాన్ని నడిపేవారికి శనిదేవుడు మంచి లాభాలను అందిస్తాడు. కెరీర్ పురోగతికి మంచి అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

కర్కాటక రాశి
శని సడే సతి చివరి దశలో ఉన్నారు. శశ రాజయోగంవల్ల నిలిచిపోయిన పనులన్నీ నెరవేరతాయి. భౌతిక సౌకర్యాలు, విలాసాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కొత్తగా వివాహమైవారు గర్భం దాల్చే అవకాశాలున్నాయి.
వృషభ రాశి
వ్యూహాలు, ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆకస్మికంగా ధనలాభం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత పెట్టుబడులు రాబడిని తీసుకువస్తాయి. ఉద్యోగం చేస్తున్నవారి కెరీర్ బాగుంటుంది. పురోగతి, డబ్బు సంపాదించేందుకు ఇది మంచి సమయం.












Click it and Unblock the Notifications